AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గోవు రాజ్యమాతగా ప్రకటన.. దేశీ ఆవు పెంపకానికి ప్రోత్సాహకాలు

గోవులకు రాజ్య మాత హోదా కల్పించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ  దేశీయ ఆవుల సంఖ్య తగ్గడంపై  ఆందోళన వ్యక్తం చేశారు.  దేశీ ఆవు మన రైతులకు వరం అని అందుకే ఈ హోదా ఇవ్వాలని నిర్ణయించామని, దానితో పాటు మేత కోసం కూడా ఏర్పాట్లు చేశామన్నారు. దేశవాళీ ఆవుల పెంపకం కోసం ప్రభుత్వం సబ్సిడీ పథకాన్ని కూడా ప్రారంభించనుంది. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం కూడా లభించిందని చెప్పారు.

ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గోవు రాజ్యమాతగా ప్రకటన.. దేశీ ఆవు పెంపకానికి ప్రోత్సాహకాలు
Rajyamata Gomata Cow
Surya Kala
|

Updated on: Sep 30, 2024 | 4:31 PM

Share

హిందువులకు ఆవుకి విశిష్ట స్థానం ఉంది. గోమాతగా భావించి పుజిస్తారు. ఈ నేపధ్యంలో మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యమాతగా దేశీ ఆవుకి హోదాను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతీయ సంప్రదాయంలో దేశీ ఆవుకి ప్రత్యెక స్థానం ఉంది. ఆవు పాలు మనుషులకు అత్యంత ఉపయోగం. ఆయుర్వేద వైద్యం, పంచగవ్య చికిత్సా విధానం, సేంద్రీయ వ్యవసాయ విధానాల్లో దేశీ ఆవు పేడ, గోమూత్రం ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి. ఆవులకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారత సంప్రదాయంలో గోవులకు ప్రత్యేక స్థానం అని.. ఆవులకు ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక, శాస్త్రీయ సైనిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని ఉత్తర్వులో పేర్కొంది.

గోవులకు రాజ్య మాత హోదా కల్పించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ  దేశీయ ఆవుల సంఖ్య తగ్గడంపై  ఆందోళన వ్యక్తం చేశారు.  దేశీ ఆవు మన రైతులకు వరం అని అందుకే ఈ హోదా ఇవ్వాలని నిర్ణయించామని, దానితో పాటు మేత కోసం కూడా ఏర్పాట్లు చేశామన్నారు. దేశవాళీ ఆవుల పెంపకం కోసం ప్రభుత్వం సబ్సిడీ పథకాన్ని కూడా ప్రారంభించనుంది. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం కూడా లభించిందని చెప్పారు.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 38 నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రెవెన్యూ శాఖ పరిధిలోని కొత్వాల్ ల వేతనాన్ని పది శాతం పెంచేందుకు ఆమోదం లభించింది. దీంతోపాటు వారిపై కారుణ్య విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. దీనితో పాటు రాష్ట్రంలోని సైనిక పాఠశాలలకు సవరించిన విధానాన్ని అమలు చేయడానికి కూడా ఆమోదం లభించింది. థానే సర్క్యులర్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగవంతం కానున్నాయి. ఈ నేపథ్యంలో రూ.12 వేల 200 కోట్లతో రివైజ్డ్ ప్లాన్ కూడా ఆమోదం పొందింది.

ఇవి కూడా చదవండి

దేశీ ఆవు రైతులకు వరం.. డిప్యూటీ సీఎం

కేబినెట్ నిర్ణయం తర్వాత మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దేశీ ఆవు మన రైతులకు ఒక వరం అని, అందుకే ఈ హోదా (రాజ్య మాత) ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అన్నారు. దేశీ ఆవుకు పోషణ, మేత విషయంలో సహాయం చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ వేగవంతం కానుంది

మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రెండవ, మూడవ నివేదికలను జస్టిస్ (రిటైర్డ్) సందీప్ షిండే ఆమోదించారు. ఇప్పుడు మరాఠాలకు ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని నిర్ణయించేందుకు సమావేశం నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్