PM Modi: ప్రధాని మోడీ రోజూ ఎన్ని గంటలు నిద్రపోతారో తెలుసా.. వెల్లడించిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్
దేశ ప్రధాని ఎన్ని గంటలు శ్రమిస్తారు. నిత్యం ఎంతసేపు విశ్రాంతి తీసుకుంటారన్న దానిపై దేశ ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు.. ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

PM Narendra Modi Rest: దేశ ప్రధాని ఎన్ని గంటలు శ్రమిస్తారు. నిత్యం ఎంతసేపు విశ్రాంతి తీసుకుంటారన్న దానిపై దేశ ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మహారాష్ట్ర(Maharashtra) భారతీయ జనతా పార్టీ(BJP) అధ్యక్షులు.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ప్రధాని మోడీ రోజూ రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని వెల్లడించారు. ఆయన నిద్రపోకుండా ఓ ప్రయోగం చేస్తున్నారని, దేశం కోసం 24 గంటలు పనిచేస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్(Chandrakant Patil) పేర్కొన్నారు. ఇటీవల కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు కొల్హాపూర్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి పాటిల్ ఈ వ్యాఖ్య చేశారు.
ప్రధాని మోడీ ప్రతిరోజులు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ప్రతిరోజూ 22 గంటల పాటు పని చేస్తారని ఆయన పేర్కొన్నారు. నిద్ర పోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రధాని ప్రతి నిమిషం దేశం కోసం పరితపిస్తూ పనిచేస్తున్నారని పాటిల్ పేర్కొన్నారు. 24 గంటలూ మెలకువగా ఉండి దేశం కోసం పని చేసేలా నిద్రను అదుపు చేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని బీజేపీ చీఫ్ అన్నారు. అతను ఒక్క నిమిషం కూడా వృధా చేయరు అని ఆయన చెప్పారు. ప్రధాని చాలా సమర్ధవంతంగా పని చేస్తారని, దేశంలో అన్ని పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆయనకు తెలుసునని బీజేపీ నేత అన్నారు.
#PMModi sleeps for only two hours every day and is doing an experiment so that he will not have to sleep and can work for the country for 24 hours, Maharashtra BJP chief Chandrakant Patil has claimed.https://t.co/OuP2vqtYO0
— Hindustan Times (@htTweets) March 21, 2022
ఇదిలావుంటే, 2019లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేయడం గమనార్హం. ఈ ఇంటర్వ్యూలో అక్షయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ప్రధాని మోడీని అడిగారు. అటువంటి పరిస్థితిలో, అతని నిద్రవేళల గురించి ఒక ప్రశ్న వచ్చింది. దానికి ప్రధాని స్పందిస్తూ నేను కేవలం మూడున్నర నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నాను అని సెలవిచ్చారు.
Read Also…




