India-Australia Summit: భారత్ లో ఆస్ట్రేలియా పెట్టుబడులు.. నేడు ఇరు దేశ ప్రధానుల మధ్య మీటింగ్..
India-Australia Summit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi), ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్(PM Scott) మోరిసన్ ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వర్చువల్ గా సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా కొత్త పెట్టుబడులపై ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటన చేయనున్నారు.
India-Australia Summit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi), ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్(PM Scott) మోరిసన్ ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వర్చువల్ గా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వాణిజ్యం, కీలకమైన ఖనిజాలు, మెుబిలిటీ, విద్యకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని.. భారత టెక్నాలజీ, క్రిటికల్ మినరల్స్ మొదలైన అనేక రంగాల్లో రూ.1,500 కోట్ల పెట్టుబడులను ప్రకటించే అవకాశం ఉంది. గతంలో జూన్ 4, 2020న రెండు దేశాలు ఇదే తరహాలో ద్వేపాక్షిక బలోపేతానికి మెదటి సారి వర్చువల్ గా చర్చలు జరిపాయి.
ఉక్రెయిన్‌లో సంక్షోభం తరుణంలో శిఖరాగ్ర సమావేశం జరగనున్నందున.. ఈ అంశం ఇరు దేశాల నాయకుల సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. క్వాడ్ భాగస్వామ్య దేశాలైన జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాలు రష్యా చర్యలను ఖండించాయి. కానీ భారత్ దీనిపై తటస్తంగా ఉంటూ ఉక్రెయిన్- రష్యాలు చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలను సూచిస్తోంది. అందువల్ల యుద్ధం విషయం కూడా చర్చల్లో ప్రధానంగా మారనుందని తెలుస్తోంది. భారత ప్రధాని తన పరిచయాల ద్వారా యుద్ధాన్ని నిలువరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను క్వాడ్ దేశాలు అంగీకరిస్తున్నాయని ఆస్ట్రేలియా నిన్న వెల్లడించింది. భారత వైఖరిని సమర్థించింది. ప్రతి దేశానికి ఉండే ద్వైపాక్షిక సంబంధాల కారణంగా తమ పరిధిలో ఉన్న మేరకు కృషి చేస్తున్న విషయాన్ని భారత విదేశాంగ శాఖ వివరణను ఆస్ట్రేలియా హై కమిషనర్ అంగీకరించారు.
ఇవీ చదవండి..
EPFO News: కొత్తగా ఉద్యోగుల్లో ఆ వయసు వారే ఎక్కువ.. రుజువుచేస్తున్న ఈపీఎఫ్‌ఓ జనవరి గణాంకాలు..
Crypto Currency: GST పరిధిలోకి క్రిప్టో కరెన్సీలు.. ఎంత శ్లాబ్ రేటు కింద పన్ను వసూలు చేస్తారంటే..