Crime news: వేరొకరితో ప్రియుడి పెళ్లి.. తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య.. మరో ట్విస్ట్ ఏంటంటే
వారిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమ (Love) గా మారింది. రెండేళ్లు గాఢంగా ప్రేమలో మునిగిన వారిలో ఒకరికి వేరొకరితో పెళ్లి నిశ్చయమైంది. విషయం తెసుకున్న యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎవరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. ఈ విషయం...
వారిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమ (Love) గా మారింది. రెండేళ్లు గాఢంగా ప్రేమలో మునిగిన వారిలో ఒకరికి వేరొకరితో పెళ్లి నిశ్చయమైంది. విషయం తెసుకున్న యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎవరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. ఈ విషయం తెలిసే లోపే యువకుడు మరో యువతికి తాళి కట్టడం గమనార్హం. పోలీసుల ఎంట్రీతో నవ వరుడు కల్యాణ మండపం నుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటక (Karnataka) లోని శివమొగ్గ (Shivamogga) ఓటీ రోడ్డులోని నివాసముండే రూపశ్రీ స్థానిక కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు. మురళి కూడా అధ్యాపకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల మురళికి మరో యువతితో వివాహం నిశ్చయమైంది.
వీరి వివాహానికి పెద్దలు ఆదివారం ముహూర్తం నిర్ణయించారు. విషయం తెలుసుకున్న రూపశ్రీ తీవ్ర మనస్తాపానికి గురైంది. జీవితం నాశనమైందని బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసే సమయానికి మురళి మరో యువతికి తాళి కట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూపశ్రీ మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు. మురళి కోసం పెళ్లి మంటపానికి చేరుకునేసరికి అతను అక్కడి నుంచి పరారయ్యాడు.
Also Read
FMCG Prices Hike: యుద్ధం తెచ్చిన తంటాలు.. మళ్లీ పెరగనున్న ఆ వస్తువుల ధరలు..
Russia-Ukraine War: ఏ క్షణమైనా అణుదాడి.. ఉక్రెయిన్ రాజధానిని చుట్టుముట్టిన రష్యా బలగాలు..(వీడియో)
World Poetry day: పదాల మాటున దాగిన భావోద్వేగం.. మదిలో భావాలకు సిరాక్షర రూపం