Gadchiroli Encounter: గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టుల హతం

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 6 గంటల పాటు భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పుల్లో ఎస్ఐతో సహా ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Encounter
Follow us

|

Updated on: Jul 18, 2024 | 6:52 AM

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 6 గంటల పాటు భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పుల్లో ఎస్ఐతో సహా ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలూ ఉన్నారు. ఇక ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో భారీగా అత్యాధునిక ఆయుధాలను భద్రతా బలగాలు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో దాదాపు 12 నుంచి 15 మంది మావోయిస్టులు దాక్కొని ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో భారీ బందోబస్తుతో డిప్యూటీ ఎస్పీ సారథ్యంలోని పోలీసులు బుధవారం ఉదయం ఆపరేషన్‌ ప్రారంభించారు. వ‌ర్షం కురుస్తున్నప్పటికీ, మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఇక పోలీసు బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. పలువురు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారికోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు.

ఇక సంఘటనా స్థలంలో 7 ఏకే 47 తుపాకీలతో పాటు పలు హై టెక్నాలజీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిపాగడ్‌ దళం ఇంఛార్జ్ లక్ష్మణ్‌ ఆత్రం అలియాస్‌ విశాల్‌ ఆత్రం ఉన్నట్లు తెలిపిన పోలీసులు, మిగతా మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. అలాగే ఈ ఎదురుకాల్పుల్లో ఎస్ఐతో సహా ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

మొత్తంగా… మావోయిస్టుల ఏరివేత‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రంలోని మోడీ స‌ర్కారు.. మ‌రిన్ని బ‌ల‌గాల‌తో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో వరుస కూంబింగులు చేప‌డుతోంది. కేంద్ర బలగాలనూ రంగంలోకి దించుతోంది. మూకుమ్మడి దాడులు చేయడంలో సిద్ధహస్తులైన బ్లాక్‌ క్యాట్స్‌ను సైతం మావోయిస్టుల ఏరివేతకు వాడుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

భారీ ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్ అగ్రనేతలు హతం..!

రుద్రాక్షను ధరించడానికి నియమాలున్నాయని తెలుసా..!

'ఆందోళన చెందవద్దు.. అప్పుడే అన్ని వివరాలు చెబుతా': నారాయణ మూర్తి

నేటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్ధుల్లో వీడని ఉత్కంఠ!

ఉప్పులో ఎన్ని రకాలున్నాయో తెలుసా? ఆరోగ్యానికి మేలు చేసే ఉప్పు ఇదే

హైదరాబాద్‌‌లో విజృంభిస్తున్న నార్వాక్‌ వైరస్‌.. నిలోఫర్‌కు క్యూ

Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి..

ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ కోసం చూస్తున్నారా.? టైటాన్‌ నుంచి

థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ డ్రింక్స్‌తో రోగనిరోధక శక్తి

28 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌... వన్‌ప్లస్‌ కొత్త ఫోన్

వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.

కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా

ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే

సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష

ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..

పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..

గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.

జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?