Coffee: మన దేశంలో కాఫీ మార్కెట్ ఎంత? అరకు కాఫీ బిజినెస్ పెరగడానికి కారణాలేంటి?

కాఫీ.. ఈ పేరు వినే లోపే దాని ఘుమఘుమలు మనల్ని చేరిపోతాయి. ఆ అరోమాకే..ఆ సువాసనకే ఆహా అనిపిస్తుంది. ఒక్క సిప్ అలా నోట్లోకి వెళ్లి.. గొంతు దిగగానే.. ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది. దాని రుచి అమోఘం. అందుకే అలాంటి కాఫీకి మన దేశంతో పాటు విదేశాల్లోనూ మంచి మార్కెట్ ఉంది. కొన్నాళ్లుగా ఇది క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలో మన కాఫీకి ఉన్న డిమాండ్ తక్కువేమీ కాదు. 2022లో ఇండియా కాఫీ మార్కెట్ విలువ 478 […]

Coffee: మన దేశంలో కాఫీ మార్కెట్ ఎంత? అరకు కాఫీ బిజినెస్ పెరగడానికి కారణాలేంటి?
Coffee Market In India
Follow us

|

Updated on: Jul 18, 2024 | 7:00 AM

కాఫీ.. ఈ పేరు వినే లోపే దాని ఘుమఘుమలు మనల్ని చేరిపోతాయి. ఆ అరోమాకే..ఆ సువాసనకే ఆహా అనిపిస్తుంది. ఒక్క సిప్ అలా నోట్లోకి వెళ్లి.. గొంతు దిగగానే.. ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది. దాని రుచి అమోఘం. అందుకే అలాంటి కాఫీకి మన దేశంతో పాటు విదేశాల్లోనూ మంచి మార్కెట్ ఉంది. కొన్నాళ్లుగా ఇది క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలో మన కాఫీకి ఉన్న డిమాండ్ తక్కువేమీ కాదు.

Coffee Market In India 1

Coffee Market In India 1

2022లో ఇండియా కాఫీ మార్కెట్ విలువ 478 మిలియన్ల డాలర్లు. 2023లో మన కాఫీ మార్కె ట్ విలువ 552.9 మిలియన్ డాలర్లు. 2024-2033 అంచనా చూస్తే.. 9.87% CAGR వద్ద.. 2032 నాటికి 1,227.47 మిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. మన దేశంలో కాఫీ అనేది ఓ ముఖ్యమైన పంట. దేశంలోని పశ్చిమ కనుమలు ప్రధాన కేంద్రంగా సాగయ్యే దీనికి ఎగుమతి సామర్థ్యం కూడా అధికంగానే ఉంది. 2028 నాటికి కాఫీ మార్కెట్ 600 మిలియన్ డాలర్లను చేరుకుంటుంది. మన దేశంలో ఎక్కువమంది తాగే కాఫీ రకాలను చూస్తే.. ఇన్ స్టంట్ కాఫీతో పాటు రోస్ట్ కాఫీ ఈ లిస్టులో ఉంటాయి. ఇక 2023, 2024లో దేశంలో కాఫీ వినియోగాన్ని చూస్తే.. 60 కిలోల బరువున్న పదిలక్షలకు పైగా బ్యాగుల కాఫీని తాగేశారు. గత ఏడాదితో పోలిస్తే.. ఇది చాలా ఎక్కువ. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 60 కేజీలున్న 170 మిలియన్లకు పైగా బ్యాగుల కాఫీని తాగేశారు. ఇందులో అమెరికాతో పాటు యూరప్ దేశాల వాటాయే ఎక్కువ.

Coffee Market In India 2

Coffee Market In India 2

మన దేశంలో కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ మాత్రం కర్ణాటకదే. ఆ తరువాతి స్థానాల్లో కేరళ, తమిళనాడు ఉన్నాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కాఫీలో 70% కంటే ఎక్కువ కర్ణాటక నుంచే వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రాష్ట్రం 2.33 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీని ఉత్పత్తి చేసింది. మన దేశంలో కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు మూడు. అవి కర్ణాటక, కేరళ, తమిళనాడు. దేశ కాఫీ ఉత్పత్తిలో ఈ మూడింటి వాటా 97 శాతం. దేశంలో అరబికా, రోబోస్తా వెరైటీలు ఎక్కువగా తయారవుతాయి. రోబస్టాతో పోలిస్తే.. అరబికాకు ఉన్న అరోమేటిక్ ఫ్లేవర్ వల్ల మార్కెట్ వేల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక రోబస్టా స్ట్రాంగ్ ఫ్లేవర్ వల్ల దానిని అనేక రకాల మిశ్రమాల్లో ఉపయోగిస్తారు.

Coffee Market In India 3

Coffee Market In India 3

గత కొన్నేళ్లుగా మన దేశంలో కాఫీ వినియోగం పెరుగుతోంది. మిడిల్ క్లాస్ లోనూ కాఫీ కల్చర్ పెరిగింది. అందుకే కాఫీ తాగేవారి సంఖ్యా పెరుగుతోంది. దేశంలో ఏడాదికి సగటున ఒకరు 30 కప్పుల కాపీని తాగుతున్నారు. అదే ప్రపంచంలో చూస్తే.. ఏడాదికి 200 కప్పులు తాగుతున్నారు. అంటే మన దేశంలో కాఫీ మార్కెట్ విస్తరణకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయని అర్థమవుతోంది. కాఫీ షాపుల సంఖ్య పెరగడం.. అలాగే అలాంటి షాపులకెళ్లి కాఫీ తాగే అలవాటూ పెరిగింది. పైగా చాలా ఆఫీసుల్లో కాఫీ వెండింగ్ మెషిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా కాఫీ తాగే అలవాటు పెరగడానికి కారణమవుతున్నాయనే చెప్పాలి. అందుకే దీని మార్కెట్ కూడా ఆశాజనకంగానే కనిపిస్తోంది.

Coffee Market In India 4

Coffee Market In India 4

సరే.. పొద్దున్నే లేచి ఓ కప్పు కాఫీ పొట్టలో పడనిదే రోజు గడవని వారు చాలామంది ఉన్నారు. అలాగని మన దేశంలో కాఫీ శతాబ్దాల తరబడి ఉందని అనుకోవడానికి లేదు. ఓసారి దీని హిస్టరీ తిరగేస్తే.. ఇది మనకు పరిచయం అయ్యింది.. 17వ శతాబ్దంలోనే. ఇథియోపియాలో దీని వినియోగం బాగా ఉండేది. తరువాత అరబ్ దేశాలకు అది కాస్తా పాకింది. అక్కడి నుంచి నెమ్మదిగా మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో అక్కడి నుంచి కొన్ని కాఫీ గింజల్ని తెచ్చి కర్ణాటకలోని చిక్ మంగుళూరులో నాటడం.. అక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడుతో పాటు కేరళకు అది వెళ్లడం.. చూస్తుండగానే.. అలా దాని సాగు పెరిగిపోయింది. ఒకటా రెండా.. ఎన్నో చోట్ల ఇది సాగవుతోంది. ఒకరా ఇద్దరా ఎంతోమంది ఇప్పుడీ బిజినెస్ లో ఉన్నారు.

Coffee Market In India 5

Coffee Market In India 5

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. అరకు లోయలో ఇది సాగవుతోంది. అలాంటి ఈ కాఫీకి ఇంటర్నేషనల్ బ్రాండ్ ని తీసుకువచ్చారు. దీనివల్ల అరకు కాఫీ అమ్మకాలు పెరుగుతున్నాయి. దీంతో ఆ ఆదాయమంతా గిరిజనులకే వెళుతుంది. దానివల్ల వాళ్లకు సాధికారత వస్తుంది. అందుకే ఏపీ ప్రభుత్వం దీనిపై సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. 2018లో పారిస్‌లో జరిగిన పోటీలో అరకు కాఫీకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అందుకే మరికొన్ని దేశాల్లో కూడా అవుట్ లెట్లను ఓపెన్ చేసే పనిలో ఉన్నారు. నిజానికి అరకు కాఫీ రుచి అమోఘం. మన దేశ ప్రధానిని కూడా ఇది ఆకట్టుకుంది. మొత్తం 2.36 లక్షల మంది రైతులు.. 2,72,000 ఎకరాల్లో అరకు కాఫీ తోటలను సాగు చేస్తున్నారు. కానీ వీటిలో 1.52 లక్షల ఎకరాల్లో దిగుబడి వస్తోంది. అది సుమారు 71 వేల టన్నులు ఉంటుంది. అటు ఆదాయం పరంగా చూస్తే.. ఎకరా కాఫీ తోటకు ఎలా లేదన్నా 40,000 నుంచి 50,000 వరకు ఆదాయం ఉంటుంది. అందుకే గిరిజన రైతులు కూడా ఇప్పుడు ఈ పంట వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇలా ఈ కాఫీ తోటల సాగు గిరిజనులకు ఆర్థిక ఆసరాను ఇస్తోంది.

Coffee Market In India 8

Coffee Market In India 8

ఏజెన్సీలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరముంది. ఎందుకంటే.. వారు కాఫీ పండ్లను అమ్మడానికే ఇష్టపడుతున్నారు. అంతకుముందు అయితే.. ఆ పండ్లను పప్పుగా చేసి… దీనినే పార్చిమెంట్ అనేవారు. ఈ పద్దతిలో అమ్మేవారు. కానీ దీని రేటు తక్కువ. దీంతో.. పండ్ల అమ్మకాలకే మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ ఓ లెక్కను చూస్తే.. 6 కేజీల కాఫీ పండ్లు తీసుకుని దానిని బాగా శుద్ధి చేసి చూస్తే.. ఒక కేజీ పార్చిమెంట్ ను ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. కానీ దీనికోసం నాలుగు రోజుల పాటు ఇద్దరు కష్టపడాల్సి ఉంటుంది. అయినా వారికి వచ్చేది కేజీకి 280 రూపాయిలే. అదే పండ్లను అమ్మితే.. కేజీకి రూ.50 వస్తాయి. అదీ కాఫీ పండ్ల అమ్మకాల వెనుక ఉన్న కథ. ఇక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. దేశంలో ఉత్పత్తయ్యే మొత్తంలో కాఫీలో.. 70 శాతం ఎగుమతి అవుతోంది. అందుకే ప్రపంచంలో అత్యధికంగా కాఫీని ఉత్పత్తి చేసే దేశాలో జాబితాలో మన దేశానిది ఐదో స్థానం.

కాఫీలో చాలా రకాలున్నాయి. అవి ఎన్నున్నా… రెండు గుణాలను బట్టి దాని రకాన్ని చెప్పచ్చు. వాటిలో ఒకటి డికాక్షన్ తీసే పద్దతి. మరొకటి.. కాఫీ తయారీలో ఎంత నీరు కలుపుతారు.. ఎంత మేర పాలు కలుపుతారో తెలిపే పద్దతి. సో.. ఈ రెండింటిని బట్టి కాఫీని చాలా రకాలుగా తయారుచేయవచ్చు. వాటిలో చూస్తే.. క్యాపచీనో, మచియాటో, లాటె, ఎస్ ప్రెసో, ప్రెపచీనో.. ఇలా చాలా రకాలున్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో టేస్ట్ నచ్చుతోంది. ఇంకొక్క సిప్ అంటూ కప్పులకు కప్పులు తాగిస్తుంది. నిన్నమొన్నటి వరకు ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలకు పడిపోనివారు లేరు. కానీ అది చేయడం పెద్ద ప్రాసెస్. అయితే ఇప్పుడు అంతా రెడీ మేడ్ పద్దతులు వచ్చేశాయి. రోజూ బయట షాప్ కు వెళ్లి కాఫీ తాగే అవకాశం ఉండదు. అలాగని రకరకాల కాఫీ టేస్ట్ ను చూడకుండా చాలామంది ఉండలేరు. అలాంటివారికోసం.. ఇంట్లోనే వాటన్నింటినీ చేసుకునేలా.. రెడీ మేడ్ ఫ్లేవర్లు మార్కెట్ లోకి వచ్చాయి. వీటి సాయంతో.. నచ్చిన టైమ్ లో.. నచ్చిన ఫ్లేవర్ తో కాఫీ టేస్ట్ ను మనసారా ఆస్వాదించవచ్చు. వావ్ అని హ్యాపీగా అనవచ్చు. ఈ ఫీలింగే.. ఈ మార్కెట్ ను క్రమంగా పెంచుతోంది.

Coffee Market In India 6

Coffee Market In India 6

అప్పట్లో అయితే.. టీ స్టాల్ కు వెళ్లి.. కాఫీ కావాలి అని ప్రత్యేకంగా అడగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాఫీ అమ్మకాల కోసమే రిటైల్ అవుట్ లెట్లు వచ్చేశాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వందల, వేల కోట్ల రూపాయిల వ్యాపారం చేస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ టీ కి ఉన్న మార్కెట్టే ఎక్కువని చెప్పాలి. అలాగే ఉత్తరభారతంలోనూ కాఫీ వినియోగం పెరగాల్సి ఉంది. ఇక వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా కాఫీ తోటల విస్తరణకు సవాళ్లు విసురుతున్నాయి. ఈ అడ్డంకులను అధిగమించి దేశీయంగా, అంతర్జాతీయంగా కాఫీ మార్కెట్ ను పెంచుకోవాల్సి ఉంది. కాఫీ తోటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకరంగా ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటోంది. హెక్టార్ కు 2500 నుంచి 3000 డాలర్లను సబ్సిడీగా ఇస్తోంది. ఇది వారికి ఆర్థికంగా తోడ్పడుతోంది.

కాఫీ వినియోగం పెరగడానికి టెక్నాలజీ కూడా తోడ్పడుతోంది. పూర్వం కాఫీ తాగాలంటే షాప్ కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాఫీ వెండింగ్ మెషీన్స్ వచ్చేశాయి. పైగా వాటిని ఫోన్లతో కూడా ఆపరేట్ చేయవచ్చు. అందుకే వీటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోవచ్చు. ఎంత కాఫీనైనా ఉత్పత్తి చేయవచ్చు. దీంతో హోటళ్లు, సాఫ్ట్ వేర్ సంస్థలు, పరిశ్రమలు, క్యాంటీన్లు, మార్కెట్లు… ఇలా చాలా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి ఆపరేట్ చేయవచ్చు. అలాగని క్వాలిటీలో రాజీపడాల్సిన పనే లేదు. టేస్ట్ కు టేస్ట్.. క్వాలిటీకి క్వాలిటీ.. రెండూ లభిస్తాయి. ఇదే మన దేశంలో కాఫీ వినియోగం పెరగడానికి బూస్ట్ ఇస్తోంది.

Coffee Market In India 7

Coffee Market In India 7

అంతర్జాతీయంగా కాఫీ ఎగుమతులను ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల అంతర్జాతీయంగా ఎక్కువ షేర్ ను సొంతం చేసుకోవడానికి వీలవుతుంది. ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా దీనిని అమలు చేస్తోంది. అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణకొరియా, ఫిన్ లాండ్ వంటి అత్యధిక విలువ ఉన్న మార్కెట్లలో బిజినెస్ చేయడానికి వీలుగా.. కేజీకి రూ.2 ల చొప్పున ఎక్స్ పోర్ట్ ఇన్సెంటివ్ ను ఇస్తోంది. దీనివల్ల హైవేల్యూ మార్కెట్లలో హైవేల్యూ గ్రీన్ కాఫీస్ ని ఎగుమతి చేయడానికి వీలవుతుంది. కాఫీ సాగును, వినియోగాన్ని పెంచే ఇలాంటి పాలసీల వల్ల దేశంలోనూ కాఫీ మార్కెట్ పెరగడానికి వీలవుతుంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాఫీ అమ్మకాల కోసం ప్రముఖ సంస్థలు ఉన్నాయి. కేవలం కాఫీ తాగడం కోసమే ప్రత్యేకంగా కెఫేలను డిజైన్ చేశారు. సో.. ఈ మార్కెట్ కూడా క్రమంగా పెరుగుతోంది.

మన కాఫీ టేస్ట్ కు విదేశాలు ఫిదా.. భారీగా పెరిగిన కాఫీ వ్యాపారం
మన కాఫీ టేస్ట్ కు విదేశాలు ఫిదా.. భారీగా పెరిగిన కాఫీ వ్యాపారం
ఆగస్టు తొలి వారంలోనే లాసెట్‌ 2024 కౌన్సెలింగ్‌.. త్వరలో షెడ్యూల్
ఆగస్టు తొలి వారంలోనే లాసెట్‌ 2024 కౌన్సెలింగ్‌.. త్వరలో షెడ్యూల్
భారీ ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్ అగ్రనేతలు హతం..!
భారీ ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్ అగ్రనేతలు హతం..!
రుద్రాక్షను ధరించడానికి నియమాలున్నాయని తెలుసా..!
రుద్రాక్షను ధరించడానికి నియమాలున్నాయని తెలుసా..!
'ఆందోళన చెందవద్దు.. అప్పుడే అన్ని వివరాలు చెబుతా': నారాయణ మూర్తి
'ఆందోళన చెందవద్దు.. అప్పుడే అన్ని వివరాలు చెబుతా': నారాయణ మూర్తి
నేటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్ధుల్లో వీడని ఉత్కంఠ!
నేటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్ధుల్లో వీడని ఉత్కంఠ!
ఉప్పులో ఎన్ని రకాలున్నాయో తెలుసా? ఆరోగ్యానికి మేలు చేసే ఉప్పు ఇదే
ఉప్పులో ఎన్ని రకాలున్నాయో తెలుసా? ఆరోగ్యానికి మేలు చేసే ఉప్పు ఇదే
హైదరాబాద్‌‌లో విజృంభిస్తున్న నార్వాక్‌ వైరస్‌.. నిలోఫర్‌కు క్యూ
హైదరాబాద్‌‌లో విజృంభిస్తున్న నార్వాక్‌ వైరస్‌.. నిలోఫర్‌కు క్యూ
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి..
ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ కోసం చూస్తున్నారా.? టైటాన్‌ నుంచి
ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ కోసం చూస్తున్నారా.? టైటాన్‌ నుంచి
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?