కరోనాను అరికట్టేందుకు దేశ రాజధానిలో ‘విశ్వశాంతి మహాయజ్ఞం’.. పూజలు, శ్లోకాలతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం.!
maha yagya in delhi: ప్రపంచమంతా ప్రాణాంతక వ్యాధిగా వ్యాపించిన కరోనా వైరస్ నిర్మూలనకు, ప్రపంచ శాంతి కోరుతూ అశోక్ సింఘాల్ ఫౌండేషన్‌తో..
maha yagya in delhi: ప్రపంచమంతా ప్రాణాంతక వ్యాధిగా వ్యాపించిన కరోనా వైరస్ నిర్మూలనకు, ప్రపంచ శాంతి కోరుతూ అశోక్ సింఘాల్ ఫౌండేషన్‌తో కలిసి నమో సద్భావన సమితి, దేశ రాజధాని ఢిల్లీలో ‘విశ్వశాంతి మహాయజ్ఞం’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఛత్తర్‌పూర్‌లోని శ్రీ ఆధ్యా కాత్యాయని శక్తి పీఠం మందిరం ప్రాంగణంలో పటిష్ట భద్రత నడుమ కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ మహాయజ్ఞాన్ని జరిపారు. సుమారు రెండు వందల మంది తెలుగు వేద పండితులు, ఋత్విక్కులు ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. వారి మంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. మార్చి 29న హోళీ పర్వదినం రోజున ప్రారంభమైన ఈ మహాయజ్ఞం ఏప్రిల్ 3వ తేదీ (శనివారం) సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ విశ్వశాంతి మహాయజ్ఞంలో సుమారు 350 మంది న్యాయమూర్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ మహాయజ్ఞంలో భాగంగా 12 వాహనకుండనాలు, నాలుగు వేదాలలోని శ్లోకాలతో యజ్ఞ ప్రాంగణం మంత్రోచ్చారణలతో సాగింది.
ప్రకృతిని శాంతింపజేయడమే కాకుండా.. మానవాళి కష్టాలను పారద్రోలాడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితంలో శాంతి, సంక్షేమం కోసం ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారని చెబుతున్నారు. శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య దివ్య ఆశీస్సులతో.. కాంచీ కామకోటి మఠానికి చెందిన జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామిజీ మార్గదర్శనంలో ఈ మహాయాగం జరిగింది. ఈ మహాయాగం గురించి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ ”దేశంలో విపత్తు సంభవించినప్పుడల్లా దాన్ని అధిగమించడానికి భగవంతుడిని స్మరించుకుంటారని” అన్నారు. అదేవిధంగా, కరోనా మహమ్మారిని కూడా ప్రద్రోలవచ్చునని తెలిపారు. అన్ని వ్యాధులపై పోరాడటానికి ప్రకృతి మనకు బలాన్ని ఇస్తుందని శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. ప్రాణాంతక వ్యాధులను ప్రకృతి ద్వారా మాత్రమే నియంత్రించవచ్చు. ఈ రోజు ప్రపంచం ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొంటుందని, ప్రధానంగా కోవిడ్ మహమ్మారి పెద్ద సవాలుగా మారిందని ఆయన అన్నారు.
Also Read:
మందుబాబులకు గుడ్ న్యూస్.. బీర్ వెరీ చీప్…. భారీగా తగ్గిన ధరలు.. వివరాలివే..!
వింత జంతువు కలకలం.. రాత్రయితే భయం.. భయం.. గ్రామస్తుల్లో ఆందోళన.!
ఆ యువ క్రికెటర్‌ను బెదిరిచిన విరాట్ కోహ్లీ.. ‘ఇలా ఆడటం ఇదే చివరిసారి’ అంటూ వార్నింగ్.!
అయ్యో.! చిరుత నోటికి చిక్కింది.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.. చివరికి ఏమైందంటే.!