AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 – 8వ తరగతి పరీక్షలు రద్దు.. పై తరగతులకు ప్రమోట్.. కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్

దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఏడాది క్రితం మొదలైన మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. మరోసారి సెకండ్ వేవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

1 - 8వ తరగతి పరీక్షలు రద్దు.. పై తరగతులకు ప్రమోట్.. కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్
Maharashtra Government Cancels Exams
Balaraju Goud
|

Updated on: Apr 03, 2021 | 7:41 PM

Share

Maharashtra cancels exams: దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఏడాది క్రితం మొదలైన మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. మరోసారి సెకండ్ వేవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మలి విడతలోనూ మహారాష్ట్రపై పంజా విసురుతోంది. దీంతో కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కరోనా కట్టడికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ వెల్లడించారు. రాష్ట్రంలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులందరినీ ఎటువంటి పరీక్షలు లేకుండా పై తరగతులకు వెళ్లేలా పాస్ చేస్తున్నామని ప్రకటించారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో సందేశాన్ని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి పోస్ట్ చేశారు. ఇక, 9 నుంచి 11 తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయడానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే త్వరలో నిర్వహించనున్న బోర్డ్ ఎగ్జామ్స్‌పై వర్ష గైక్వాడ్ ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదు.

ఇక, మహారాష్ట్రలో ఎస్ఎస్‌సీ, హెచ్‌ఎస్‌సీ బోర్డ్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, విద్యార్థులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా పరీక్షలను సేఫ్‌గా నిర్వహించేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం విద్యా శాఖ మంత్రి వర్ష గైక్వాడ్ పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి చర్చించి.. పరీక్షలను అత్యుత్తమంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఆ కమిటీలను కోరారు. . అయితే, పరీక్షలను సురక్షితంగా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ గతంలో చెప్పింది. ప్రస్తుత తరుణంలో పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, మహారాష్ట్రలో కరోనా వికృత రూపం కొనసాగుతుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కఠి నియంత్రణ చర్యలు, ఆంక్షలు విధించింది మహరాష్ట్ర సర్కార్. ఇదే క్రమంలోనే కరోనా పరిస్థితి అదుపులోకి రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం సాగింది.

ఇదిలావుంటే, శుక్రవారం రోజున వాటిపై స్పందించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఆయన స్పష్టం చేశారు. అయితే పూర్తి లాక్‌డౌన్‌కు బదులుగా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టామని.. రెండు మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని అన్నారు. ఇక, మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే దాదాపు 47వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Read Also… అసోంలో ఎన్నికల ప్రసంగాన్ని మధ్యలో ఆపిన నరేంద్ర మోదీ.. జనంలోకి వెళ్లిన ప్రధాని మెడికల్ టీమ్‌.. అసలేం జరిగిందంటే..?

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా