శరవేగంగా కుంభమేళా ఏర్పాట్లు.. మమతా బెనర్జీ నుంచి ఒమర్ అబ్దుల్లా వరకు ప్రతిపక్ష రాష్ట్రాల సిఎంలకు ఆహ్వానం

హిందూ సంప్రదాయంలో నదులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు పుజిస్తారు. నదులకు పుష్కరాలు, కుంభమేళావంటి వేడుకలను నిర్వహిస్తారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభ మేళా జాతర ప్రయాగ్ రాజ్ లోని 2025 జనవరిలో ప్రారంభం కానుంది. త్రివేణీ సంగం ఒడ్డున జరిగే మహా కుంభ మేళాకు ప్రముఖులను ఆహ్వానించడానికి యోగి సర్కార్ సిద్ధం అవుతుంది. మహా కుంభ మేళా ప్రపంచంలోనే అతిపెద్ద హిందువు ఉత్సవం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ మేళా ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది. ఇది మహాకుంభమేళా జిల్లాగా పిలువబడే రాష్ట్రంలోని 76వ జిల్లా.

శరవేగంగా కుంభమేళా ఏర్పాట్లు.. మమతా బెనర్జీ నుంచి ఒమర్ అబ్దుల్లా వరకు ప్రతిపక్ష రాష్ట్రాల సిఎంలకు ఆహ్వానం
Mahakumbh 2025
Follow us
Surya Kala

|

Updated on: Dec 07, 2024 | 12:16 PM

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళాను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ఉత్సవాల కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రయాగ్‌రాజ్ మహా కుంభ మేళా కోసం బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలను పంపించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వానించేందుకు మంత్రులను పంపాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు అసీమ్ అరుణ్ వెళ్లనున్నారు.

స్వతంత్ర దేవ్ సింగ్ మధ్యప్రదేశ్‌కు, ఒక శర్మ గుజరాత్‌కు వెళ్లనున్నారు. సిక్కింకు ఓంప్రకాష్ రాజ్‌భర్, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు రాకేష్ సచన్, దయాశంకర్ సింగ్, త్రిపురకు దయాశంకర్ మిశ్రా దయాలు, జార్ఖండ్‌కు యోగేంద్ర ఉపాధ్యాయ, హర్యానా, పంజాబ్‌లకు సూర్య ప్రతాప్ షాహి, బల్దేవ్ ఔలాఖ్, కర్ణాటక, ఢిల్లీకి సురేష్ ఖన్నా, బేబీ రాణి మౌర్యలను ఉత్తరాఖండ్‌కు పంపనున్నారు.

ఈ రాష్ట్రాల సీఎంలకు కూడా ఆహ్వానాలు పంపనున్నారంటే

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ , కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు కూడా ఆహ్వానం పంపనున్నారు.

ఇవి కూడా చదవండి

కుంభమేళా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విడుదల

2025 మహా కుంభమేళా కోసం 2100 కోట్ల రూపాయల గ్రాంట్‌ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీని తొలి విడతగా రూ.1050 కోట్లు కూడా విడుదల చేసింది. మహా కుంభమేళా నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5435.68 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని 421 ప్రాజెక్టులకు ఖర్చు చేస్తోంది. యూపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3461.99 కోట్లకు ఆమోద ముద్ర వేసింది. దీంతో మహా కుంభమేళాను మరింత ఘనంగా, వైభవంగా నిర్వహించనున్నారు.

మహా కుంభమేళా కొత్త జిల్లా

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది. ఇది మహాకుంభమేళా జిల్లాగా పిలువబడే రాష్ట్రంలోని 76వ జిల్లా. కుంభమేళా ప్రత్యేక కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడం, పరిపాలనా పనులను మెరుగ్గా నిర్వహించడం లక్ష్యంగా ఈ కొత్త జిల్లా ఏర్పాటు చేయబడింది.

డిసెంబర్ 13న ప్రధాని మోడీ సమీక్ష

డిసెంబర్ 13న మహా కుంభమేళా సన్నాహాలను ప్రధాని మోడీ సమీక్షించనున్నారుఎ. ఈ రోజున ప్రయగ్ రాజ్ లో జరుగుతున్న అన్ని ఏర్పాట్లను సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలించనున్నారు. ముఖ్యమైన రోడ్లన్నింటినీ శరవేగంగా సుందరీకరణ చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వీధి దీపాలు, థీమ్ లైటింగ్ పనులు జరుగుతున్నాయి. విద్యుత్ శాఖ ద్వారా విద్యుత్ తీగలు వేసే పనులు శరవేగంగా సాగుతున్నాయి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..