Hidden Forts in Mumbai: ముంబైలో పురాతన, చారిత్రక కోటలు ఎన్నో.. అనేక సినిమా షూటింగ్స్ జరుపుకున్న పోర్ట్స్ పై ఓ లుక్ వేయండి..
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో సందర్శించడానికి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ముంబై అందాలను చూసేందుకు విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. అయితే ముంబైలో అరేబియా సముద్రం, సినీ తారల బంగ్లాలే కాకుండా ఎన్నో చారిత్రక కోటలు ఉన్నాయని మీకు తెలుసా.
నేటి యువత కలల నగరం ముంబై చాలా సుందరమైన నగరం. ముంబైలో సందర్శించడానికి, అన్వేషించడానికి అనేక చారిత్రక, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అంతేకాదు చాలా మంది పెద్ద సినిమా స్టార్ల ఇళ్లను చూసేందుకు కూడా ఇక్కడికి వస్తుంటారు. సినిమా తారలతో నిండిన ఈ నగరంలో కొన్ని ప్రదేశాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఢిల్లీ-జైపూర్‌ల మాదిరిగానే ముంబైలో కూడా చూడదగ్గ అనేక కోటలు ఉన్నాయి. ప్రజలు ముంబైకి వెళతారు.. అయితే ఆ కోటల అందాలను చారిత్రక కథలను పట్టించుకోకుండా సముద్ర తీరంలో విహరిస్తూ ఆనందిస్తారు. ముంబైలో అరేబియా సముద్రం.. బాలీవుడ్ స్టార్స్ నివసించే ఇల్లులు మాత్రమే కాదు ఇక్కడ అనేక చారిత్రక కోటలు కూడా ఉన్నాయి. ముంబైకి ఎప్పుడైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ కోటలను ఖచ్చితంగా సందర్శించండి.
కాస్టెల్లా డి అగుడా: ఈ కోటను బాంద్రా కోట అని కూడా అంటారు. ఇది ముంబయిలోని నాగరిక ప్రాంతమైన బాంద్రాలో ఉంది. ఈ కోటను పోర్చుగీసు వారు పాలించిన సమయంలో నిర్మించారు. ఈ కోట సముద్ర మట్టానికి 24 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కోట షూటింగ్ స్పాట్ కు ప్రసిద్ధి చెందినది. ఈ కోటలో దిల్ చాహ్తా హై వంటి అనేక సూపర్ హిట్ సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి.
వర్లీ కోట: ఈ కోట ముంబైలోని చారిత్రక ప్రదేశం. అయితే ఈ కోట గురించి చాలా తక్కువ మందికి తెలుసు. శత్రు నౌకలు, సముద్రపు దొంగలపై నిఘా ఉంచేందుకు ఈ కోటను బ్రిటిష్ వారు కొండపైన నిర్మించారు. ఈ కోట సందర్శకుల వీక్షనార్ధం వారమంతా తెరిచి ఉంటుంది. ఈ కోటను సుర్యోదపు సమయంలో ఉదయం 5 నుంచి సూర్యాస్తమం సమయం అంటే సాయంత్రం 7 గంటల మధ్య సందర్శించవచ్చు.
బేసిన్ కోట (వసాయి కోట): బేసిన్ ఫోర్ట్ ముంబైలోని వాసాయిలో ఉంది. దాదాపు 110 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కోటను పోర్చుగీస్ వారు నిర్మించారు. ఈ కోట చాలా పెద్దది. ఇందులో 6 చర్చిలు మూడు కాన్వెంట్లతో సహా అనేక భవనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కోట శిథిలావస్థలో ఉంది. అయినా సరే ఈ కోట చూడదగిన ప్రదేశం.
ఇర్మిత్రి కోట: ఈ కోటను డోంగ్రీ కోట అంటారు. ఈ కోట మరాఠా పాలనలో నిర్మించబడింది. ఈ కోట చుట్టూ 360 డిగ్రీలలో అందమైన ప్రదేశాలను చూడవచ్చు. ఈ కోట సముద్ర తీరంలో ఉంది. ఉత్తరాన వసాయి కోట, తూర్పున బోరివలి నేషనల్ పార్క్, దక్షిణాన ఎస్సెల్ వరల్డ్, వాటర్ కింగ్‌డమ్ ఉన్నాయి. ఇక్కడికి వెళితే ఒక్కసారే ఎన్నో అందమైన పురాతన, చారిత్రక ప్రదేశాలను చూడొచ్చు.
క్రాస్ ఐలాండ్ ఫోర్ట్: ఈ కోట ముంబై హార్బర్‌లో ఉంది. ఇక్కడ చమురు శుద్ధి కర్మాగారం, పెద్ద గ్యాస్ ట్యాంకులను చారిత్రక అవశేషాలున్నాయి. ఇక్కడికి చేరుకోవడానికి మీరు స్పీడ్ బోట్‌ని ఉపయోగించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..