AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sour Curd: పెరుగు పులిసి పోయింది పాడేస్తున్నారా.. ఇలా వాడేయండి..

పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో అనేక పోసకాలు ఉంటాయి. అయితే ఒక్కోసారి పెరుగు పులిసిపోతుంది. దీంతో చాలాా మంది పారేస్తూ ఉంటారు. కానీ అలా చేయకుండా ఇలా చేయవచ్చు..

Sour Curd: పెరుగు పులిసి పోయింది పాడేస్తున్నారా.. ఇలా వాడేయండి..
Sour Curd
Chinni Enni
|

Updated on: Dec 07, 2024 | 12:03 PM

Share

పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. రోజులో కనీసం ఒకసారైనా పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియాను బయటకు పంపించి.. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. అంతే కాకుండా పెరుగు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సమస్యలు, చర్మ, జుట్టు సమస్యలను కంట్రోల్ చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా పెరుగు చక్కగా పని చేస్తుంది. చిన్న పిల్లలకు ప్రతి రోజూ ఒకసారైనా పెరుగుతో అన్నం పెడితే వారి ఎదుగుదలలో తోడ్పడుతుంది. పెరుగున్నంలో ఒక ఆవకాయ ముక్క వేసుకుని తింటే.. ఆహా ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది. అయితే ఒక్కోసారి పెరుగు పులుస్తుంది. దీంతో పెరుగను చాలా మంది పారేస్తూ ఉంటారు. అలా పారేయకుండా పెరుగును చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పుల్లటి పెరుగు తీసుకున్నా మంచిదే.

పులవకుండా ఉండాలంటే ఇలా చేయండి:

పెరుగు పులవకుండా ఉండాలంటే.. పెరుగు తోడు పెట్టిన తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ ఉంచండి. ఇలా ఉంచడం వల్ల త్వరగా పులిసి పోకుండా ఉంటుంది. కనీసం రెండు, మూడు రోజులైనా పెరుగు పులవకుండా ఉంటుంది.

ఇడ్లీ – దోశ పిండి:

ఇడ్లీ, దోశ పిండ్లు ఒక్కోసారి పులవవు. పిండి పులవక పోతే పెద్దగా రుచి ఉండవు. ఇడ్లీలు, దోశలు చప్పగా ఉంటాయి. అలాంటి సమయంలో అందులో పులిసిన పెరుగును కలపొచ్చు. దీని వల్ల దోశలు, ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మజ్జిగ చారు చేయండి:

పెరుగు పులిసి పోతే అన్నం వేసుకుని తింటే చాలా పుల్లగా అనిపిస్తుంది. ఈ పెరుగుతో మసాలా పెరుగు చారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో వేసుకుని తింటా చాలా బాగుంటుంది.

కూరల్లో వాడేయండి:

పులిసిన పెరుగును అన్నంలోకి కూడా వాడుకోవచ్చు. దీని వల్ల కూరలకు కూడా మంచి రుచి, కలర్ వస్తుంది. ఈ కర్రీలను అన్నం, చపాతీల్లోకి తినవచ్చు. దోశల్లో కూడా వేసుకుని తినవచ్చు. ఇంట్లో ఏదన్నా మసాలా వంటలు చేసినప్పుడు ఈ పులిసిన పెరుగును వాడుకోవచ్చు. గ్రేవీ కర్రీల్లో వాడితే చాలా మంచిది.

కర్డ్ రైస్:

కొంత మంది ప్రసాదంగా లేదా డిన్నర్, బ్రేక్ ఫాస్ట్‌లోకి దద్దోజనం, కర్డ్ రైస్ చేసుకుంటూ ఉంటారు. ఇలా పులిసిన పెరుగుతో కూడా కర్డ్ రైస్ చేసుకోవచ్చు. డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో తీసుకోవచ్చు. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..