AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayadashami Akshardham: అక్షరధామ్ ఆలయ ప్రాంగణంలో విశ్వ శాంతి యాగం.. ఘనంగా విజయదశమి వేడుకలు

Vijayadashami Akshardham: న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయ ప్రాంగణంలో విశ్వ శాంతి యాగం జరిగింది. సుమారు 1400 మంది భక్తులు ఈ యాగంలో ప్రత్యేక్షంగా పాల్గొన్నారు. అక్షరధామ్ ఆలయ నిర్మాణం అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో స్వామినారాయణ్ ఆధ్యాత్మిక సంప్రదాయానికి చెందిన ఐదవ వారసుడు ప్రముఖస్వామి మహారాజ్ నేతృత్వంలో జరిగింది.

Sanjay Kasula
|

Updated on: Oct 24, 2023 | 7:30 PM

Share

విజయదశమి సందర్భంగా న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయ ప్రాంగణంలో విశ్వ శాంతి యాగం జరిగింది. సుమారు 1400 మంది భక్తులు ఈ యాగంలో ప్రత్యేక్షంగా పాల్గొన్నారు. పవిత్ర యాగంలో 1400 మంది భక్తుల కోసం 111 యాగ వేదికలను ఏర్పాటు చేశారు. స్వస్తిక ఆకారంలో వాటిని ఏర్పాటు చేశారు. యాగానికి సంబంధించిన నైవేద్యాలను అన్ని బలిపీఠాల ముందు అందించారు. భగవాన్ బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుడితోపాటు విఘ్నేశ్వరుడిని ఆవాహన పలకడంతో యాగం మొదలైంది.

పెద్ద ఎత్తున మంత్రోచ్ఛారణల మధ్య యాగం జరిగింది. “సత్సంగ్ దీక్ష” గ్రంథంలోని 315 శ్లోకాల మంత్రముగ్ధులను చేయడంతో ఆ ప్రాంగణమంతా నిండిపోయింది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయ సముదాయం కావడంతో అక్షర‌ధామ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.

అక్షరధామ్ ఆలయ నిర్మాణం అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో స్వామినారాయణ్ ఆధ్యాత్మిక సంప్రదాయానికి చెందిన ఐదవ వారసుడు ప్రముఖస్వామి మహారాజ్ నేతృత్వంలో జరిగింది. ఢిల్లీలోని ఈ అక్షరధామ్ 2005లో భక్తులు, సందర్శకుల కోసం సిద్ధం అయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి