Mysore Dasara: వైభవంగా మైసూర్ దసరా జంబూసవరి మహోత్సవం.. బంగారు అంబారీపై చాముండేశ్వరి అమ్మవారి ఊరేగింపు..

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూర్ దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణలలో ఒకటైన జంబూ సవారి ఇప్పుడు అద్భుతంగా సాగింది. అభిమన్యుడి 750 కిలోల బంగారు అంబారీపై కూర్చున్న చాముండేశ్వరిని లక్షలాది మంది వీక్షించారు. మీన లగ్నం సందర్భంగా సీఎం సిద్ధరామయ్య చాముండేశ్వరి చిత్రపటానికి పూలమాలలు వేసి చారిత్రక జంబూ యాత్రను ప్రారంభించారు. అనంతరం అభిమన్యుడు చాముండేశ్వరి విగ్రహంతో పాటు బంగారు అంబారీని ఎత్తుకుని రాజబీడీపై గంభీరంగా ఊరేగించారు.

Mysore Dasara: వైభవంగా మైసూర్ దసరా జంబూసవరి మహోత్సవం.. బంగారు అంబారీపై చాముండేశ్వరి అమ్మవారి ఊరేగింపు..
Jambu Savari Parade Mysore
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 24, 2023 | 6:02 PM

మైసూర్ ప్యాలెస్​లో దసరా ఉత్సవాలు కనుల పండుగగా జరుతున్నాయి. కర్ణాటకలో పది రోజులపాటు దసరా వేడుకలు జరుగుతాయి. దానిలో భాగంగా.. ఇవాళ చివరి రోజు కావడంతో.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దసరా జంబూ సవారి ఊరేగింపు కొనసాగుతోంది. దసరా జంబూ సవారి ఊరేగింపుకు 11 మంది ఐపీఎస్‌ల సారథ్యంలో 4 వేల మంది పోలీసులు మోహరించారు. ఈ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ హాజరయ్యారు. ఐదు హామీల శకటాలు మైసూరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వ ఐదు పథకాల సందేశాన్ని తెలియజేసేలా శకటాలు ఏర్పాటు చేశారు. శక్తి యోజన, గృహలక్ష్మి, అన్నభాగ్య యోజన, యువనిధి యోజన కార్యక్రమాలతో శకటాలు రూపొందించారు.

మైసూర్ ఉత్సవాలను ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి