స్లాబ్ వేస్తుండగానే కుప్పకూలిన సినిమా హాల్ పైకప్పు.. ఇద్దరు కార్మికులు మృతి!
మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న సినిమా హాల్ పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఝబువా జిల్లాలోని పెట్లావాడ్‌లోని థాండ్లా రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న సినిమా హాల్ పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఝబువా జిల్లాలోని పెట్లావాడ్‌లోని థాండ్లా రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నాయి.
పెట్లావాడ్‌లోని థాండ్లా రోడ్డులోని పెట్రోల్ పంప్ వెనుక బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు ఝబువా ఎస్పీ పద్మవిలోచన్ శుక్లా తెలిపారు. ఈ బహుళ అంతస్తుల భవనంలో సినిమా హాలు నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఆదివారం(మార్చి 23) మధ్యాహ్నం భవనం పైకప్పు స్లాబ్ చేసే పని జరుగుతుండగా, అకస్మాత్తుగా సెట్టింగ్ కూలి భవనం పైకప్పు కూలిపోయిందని ఎస్పీ చెప్పారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనలో భవన నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మరణించారని, పోలీసులు, జిల్లా యంత్రాంగం ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ పద్మవిలోచన్ శుక్లా అన్నారు. ఈ సంఘటనలో కొంతమందికి గాయాలు అయ్యాయి. వారిని శిథిలా నుంచి బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు.
నిర్మాణంలో ఉన్న భవనంలో భద్రతను జాగ్రత్తగా చూసుకోలేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. ఈ విషయంలో దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సంఘటనలో దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. భవన నిర్మాణ కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు ముందుగా సహాయక చర్యలు చేపట్టారని ఆయన అన్నారు.
మూడవ అంతస్తులో ఒక పెద్ద హాలు నిర్మిస్తున్నట్లు అక్కడ ఉన్న ప్రజలు చెప్పారు. మధ్యలో ఒక స్తంభం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ స్తంభం ఏర్పాటు చేయలేదు. దాని కారణంగా భవనం పైకప్పు కూలిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది కార్మికులు పైకప్పుపై నిలబడి కాంక్రీటుతో నింపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VIDEO | Madhya Pradesh: Rescue operation underway after the roof collapse of an under-construction building in Petlawad of Jhabua district. More details awaited.
(Source: Third Party)
(Full video available on PTI Videos- https://t.co/dv5TRARJn4)#MadhyaPradesh pic.twitter.com/lYFqR2g6Hc
— Press Trust of India (@PTI_News) March 23, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..