LPG Cylinder Price : గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్..! భారీగా పెరిగిన ఎల్పీజి సిలిండర్ ధరలు.. ప్రస్తుత ధరలు ఇలా..?
LPG Cylinder Price : పెరుగుతున్న ద్రవ్యోల్బణ యుగంలో సామాన్యులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నేటి నుంచి (01 జూలై 2021), ఎల్‌పిజి ధరలు పెరిగాయి.

LPG Cylinder Price : పెరుగుతున్న ద్రవ్యోల్బణ యుగంలో సామాన్యులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నేటి నుంచి (01 జూలై 2021), ఎల్‌పిజి ధరలు పెరిగాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఇంట్లో ఉపయోగించే ఎల్‌పిజి సిలిండర్లపై రూ .25.50 పెంచాయి. దీంతో రాజధాని ఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర 834.50 రూపాయలకు పెరిగింది. ఇక కోల్‌కతాలో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర రూ .861, ముంబైలో రూ .884.5 కు చేరుకుంది. అంతకుముందు జూన్ నెలలో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. చమురు కంపెనీలు ఏప్రిల్‌లో 14.2 కిలోల ఎల్‌పిజి ధరలను రూ.10 తగ్గించాయి. మేలో దాని ధరలో ఎటువంటి మార్పు లేదు. అయితే 19.2 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరను రూ.123 పెంచారు.
ఎల్పీజీ సిలిండర్ ధర ఎందుకు పెరుగుతుంది.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 80 శాతం విదేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. అటువంటి పరిస్థితిలో అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధర భారీగా పెరుగుతుంది.
ఈ సంవత్సరం ధరలు ఎప్పుడు పెరిగాయి? ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.694 కాగా ఫిబ్రవరిలో సిలిండర్‌కు రూ.719 కు పెంచారు. ఫిబ్రవరి 15 న ధరలను మరోసారి పెంచారు. ఆ తర్వాత ఇది 769 రూపాయలకు చేరుకుంది. దీని తరువాత ఫిబ్రవరి 25 న ఎల్పిజి సిలిండర్ల ధర మరోసారి పెరిగింది. ఆ తరువాత ధరలు 794 రూపాయలకు చేరుకున్నాయి. మార్చిలో పెంపు తరువాత సిలిండర్ ధరలు రూ .819 కు చేరుకున్నాయి.
ఎల్‌పిజి సిలిండర్ల ధరలు ఎలా నిర్ణయిస్తారు.. ఎల్‌పిజి సిలిండర్ల ధరలు సగటు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ రేటు, విదేశీ కరెన్సీ మార్పిడి రేటు ప్రకారం నిర్ణయిస్తారు. ఈ కారణంగా ప్రతి నెల ఎల్‌పిజి సిలిండర్ సబ్సిడీ మొత్తం కూడా మారుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం ఎక్కువ రాయితీలు ఇస్తుంది. రేట్లు తగ్గినప్పుడు, సబ్సిడీ తగ్గించబడుతుంది. పన్ను నిబంధనల ప్రకారం.. ఇంధన మార్కెట్ ధరపై ఎల్‌పిజిపై వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) లెక్కిస్తారు.