LPG Gas Cylinder: వినియోగదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధరలు.. ఈసారి ఎంతంటే..!

LPG Gas Cylinder: కొత్త నెల ప్రారంభమైంది. సామాన్యులపై మరో భారం పడింది. నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా రెండోసారి చముర కంపెనీలు..

LPG Gas Cylinder: వినియోగదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధరలు.. ఈసారి ఎంతంటే..!
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 01, 2021 | 1:57 PM

LPG Gas Cylinder: కొత్త నెల ప్రారంభమైంది. సామాన్యులపై మరో భారం పడింది. నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా రెండోసారి చముర కంపెనీలు వంట గ్యాస్ ధరలను పెంచేశాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై మరోసారి రూ. 25 వడ్డించాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెలలో గ్యాస్ సిలిండర్‌పై రూ. 100 మేర చమురు కంపెనీలు పెంచిన సంగతి తెలిసిందే. గత నెలలో ఫిబ్రవరి 4న రూ. 25 పెరగగా, ఫిబ్రవరి 14న రూ. 50, ఇక ఫిబ్రవరి 25న రూ. 25 వెరిసి.. ఆ నెల మొత్తంలో సిలండర్ ధర రూ. 100 పెరిగింది.

ఇక ఇప్పుడు పెంచిన ధరలతో కలిపి గ్యాస్ సిలిండర్‌పై రూ. 125 అదనపు భారం పడింది. దీనితో సిలిండర్ ధర రూ. 819కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 794 నుంచి రూ. 819కి చేరుకోగా.. ముంబైలో కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ. 819కి చేరుకోగా.. కోల్‌కతాలో రూ. 845.50కి.. చెన్నైలో రూ. 835కి ఎగబాకింది. అలాగే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 90.50 పెరిగింది. దీనితో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1614 నుంచి రూ .1523.50కి ఎగబాకింది. అదేవిధంగా ముంబైలో రూ.1563.50కి చేరింది. కోల్‌కతాలో ఈ ధర రూ. 1681.50, చెన్నైలో రూ. 1730.5గా ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి:

కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!