AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election 2024: భారత్ ఎన్నికల్లో ఇజ్రాయేల్ దేశ కంపెనీ జోక్యం.. Open AI సంచలన నివేదిక!

2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ నేటితో పూర్తవుతుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. ఇంతలో ఓ పెద్ద కుట్ర బయటపడింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలను ఉపయోగించి లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నాలను గూఢచార ప్రచారాలను విఫలం చేసినట్లు అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ పేర్కొంది.

Lok Sabha Election 2024: భారత్ ఎన్నికల్లో ఇజ్రాయేల్ దేశ కంపెనీ జోక్యం.. Open AI సంచలన నివేదిక!
Voting
Balaraju Goud
|

Updated on: Jun 01, 2024 | 9:26 AM

Share

2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ నేటితో పూర్తవుతుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. ఇంతలో ఓ పెద్ద కుట్ర బయటపడింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలను ఉపయోగించి లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నాలను గూఢచార ప్రచారాలను విఫలం చేసినట్లు అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ పేర్కొంది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనకు కేవలం 4 రోజుల ముందు భారీ కుట్ర బహిర్గతం అయ్యింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఒక కంపెనీ భారత్‌ ఎన్నికలపై దృష్టి సారించింది. అధికార భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు సృష్టించడం ప్రారంభించిందని Open AI నివేదిక పేర్కొంది. కెనడా, యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, ఘనాతో సహా అనేక ప్రాంతాలలో ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ఈ సంస్థ ప్రయత్నించినట్లు వెల్లడించింది.ఇందులో భాగంగా “జీరో జెనో” అనే సంకేతనామంతో రహస్య ఆపరేషన్ జరిగినట్లు Open AI గుర్తించింది.

అదే సమయంలో, లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించిన ఇజ్రాయెల్ కంపెనీ మే నెలలోనే తన కార్యాచరణ ప్రారంభించింది. ఈ నెట్‌వర్క్‌ను ఇజ్రాయెలీ రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ STOIC నిర్వహిస్తుందని నివేదిక వెల్లడించింది. ఓపెన్ AI నివేదిక ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడానికి లేదా రాజకీయ ఫలితాలను ప్రభావితం చేయడానికి ఉపయోగించిన గూఢచార ప్రయోజనాల కోసం AI ఉపయోగించినట్లు పేర్కొంది.

ఇంటెలిజెన్స్ కార్యకలాపాల కోసం కంటెంట్‌ను సృష్టించడానికి, ఫలితాలను సవరించడానికి అనేక ఇజ్రాయెల్-రన్ ఖాతాలు ఉపయోగించింది. ఈ కంటెంట్ ట్విట్టర్ X, Facebook, Instagram, వెబ్‌సైట్, YouTube వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల వేదికగా ప్రచారం చేసింది. మే ప్రారంభంలో నెట్‌వర్క్ భారతదేశంలోని ఆంగ్ల భాషా కంటెంట్‌తో ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించిందని నివేదిక పేర్కొంది.

ఈ నివేదికపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ, బీజేపీని టార్గెట్ చేస్తూ కొన్ని భారతీయ రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇందుకు విదేశీ సంస్థలు సాయం చేస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపించిందన్నారు. దేశ ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరమైన ముప్పు అని కేంద్ర మంత్రి అభివర్ణించారు. భారత్ వెలుపల ఉన్న ఆసక్తులు దీనిని స్పష్టంగా నడిపిస్తున్నాయన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బట్టబయలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయంలో ఈ ప్లాట్‌ఫారమ్‌లు దీనిని చాలా ముందుగానే విడుదల చేసి ఉండవచ్చని, ఎన్నికలు ముగిసిన తర్వాత ఎక్కువ సమయం తీసుకోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలావుంటే, భారతదేశంతో సహా పలు దేశాల్లోని సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్న Instagramలో అనేక ఖాతాలు, పేజీలు, గ్రూపులను తొలగించినట్లు Meta పేర్కొంది. ఈ చర్య వెనుక ఉన్న నెట్‌వర్క్, చైనా నుండి ఉద్భవించింది. సిక్కుల వలె నటిస్తూ, సిక్కు అనుకూల నిరసనలను ప్రోత్సహిస్తూ ఆపరేషన్ K అనే కాల్పనిక కార్యకర్త ఉద్యమాన్ని సృష్టించినట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఫోటో ఎడిటింగ్ సాధనాల ద్వారా మార్చబడిన AI ద్వారా రూపొందించిన చిత్రాలను తరచుగా ఉపయోగించి కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ఉపయోగినట్లు తెలుస్తోంది. ఈ గ్రూపులను నిర్వహించడానికి నెట్‌వర్క్ నకిలీ ఖాతాలను ఎలా ఉపయోగిస్తుందో Meta నివేదిక వివరించింది. ఫ్లాగ్ చేయబడిన కంటెంట్ పంజాబ్‌లో వరదలు, ప్రపంచ సిక్కు సమస్యలు, ఖలిస్తాన్ అనుకూల ఉద్యమం, కెనడాలో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వంటి అంశాలను ప్రస్తావించినట్లు పేర్కొంది. “నిజమైన కమ్యూనిటీలలో గణనీయమైన అనుచరులను ఏర్పాటు చేయడానికి ముందు మేము ఈ కార్యాచరణను తీసివేయడానికి వేగంగా చర్య తీసుకున్నాము” అని మెటా పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…