Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే సీట్లు ఇవే.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన

దేశం సంపదను మోదీ ముగ్గురు బడా వ్యాపారవేత్తల చేతిలో పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్‌గాంధీ. ఇండియా కూటమి అధికారం లోకి వస్తే ఆర్ధిక సర్వేతో కులగణన చేసి దళితులు , ఓబీసీలకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం...

Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే సీట్లు ఇవే.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన
Tejashwi Yadav = Rahul Gandhi
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 20, 2024 | 8:21 PM

బిహార్‌ లోని బాగల్పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ. బీజేపీ నేతలు మరోసారి అధికారం లోకి వస్తామన్న భ్రమలో ఉన్నారని విమర్శించారు. బీజేపీకి 150 కంటే తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే మోదీ అవినీతి స్కూల్‌కు తాళం పడుతుందన్నారు రాహుల్.

దేశం సంపదను మోదీ ముగ్గురు బడా వ్యాపారవేత్తల చేతిలో పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్‌గాంధీ. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఆర్ధిక సర్వేతో కులగణన చేసి దళితులు , ఓబీసీలకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ మోదీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద స్కామ్‌ అని విమర్శించారు. బీజేపీకి విరాళాలు ఇచ్చిన వాళ్లకు లిక్కర్‌ స్కామ్‌లో బెయిల్ లభించిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

“భారత్‌ లోని అన్ని పోర్ట్‌లు , ఎయిర్‌పోర్ట్‌లు , పవర్‌ ప్రాజెక్ట్‌లు, రక్షణరంగం లోని ప్రాజెక్ట్‌లన్నీ అదానీకి అప్పగించారు. బీజేపీకి వచ్చే సీట్లపై ఆ పార్టీ నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారు. బీజేపీకి 150 కంటే ఎక్కువ సీట్లు రావు. వాళ్లు ఎన్ని గొప్పలు చెప్పినా 150 కంటే ఒక్క సీటు ఎక్కువ రాదు” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

దక్షిణ భారతంలో కాంగ్రెస్‌ తరపున జోరుగా ప్రచారం చేస్తున్నారు ప్రియాంకాగాంధీ, తిరువనంతపురంలో రోడ్‌షో నిర్వహించారు. ఓటర్లతో మమేకమయ్యారు ప్రియాంక. మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఈ ఎన్నికలు పరీక్ష అని అన్నారు. నియంతృత్వాన్ని తరిమికొట్టాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ