Viral: చైనా మాంజా ఎఫెక్ట్.. ఈ ఏర్పాటు లేకపోతే గొంతు తెగిపోద్ది మరి..

గాలిపటం మాంజా మిగులుస్తున్న విషాదాలు అన్నీఇన్నీ కావు.. మనుషుల ప్రాణాలను సైతం మాంజా దారం బలి తీసుకుంటోంది. ఇటీవల జరిగిన వేర్వేరు ఘటనల్లో.. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు గాయపడ్డారు. చైనా మాంజా.. ఇది సాధారణ దారం కంటే గట్టిగా, పదునుగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా మార్కెట్‌లో చైనా మాంజా విక్రయానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

Viral: చైనా మాంజా ఎఫెక్ట్.. ఈ ఏర్పాటు లేకపోతే గొంతు తెగిపోద్ది మరి..
2 Wheeler
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 09, 2025 | 1:04 PM

చైనా మాంజా.. ఇది సాధారణ దారం కంటే గట్టిగా, పదునుగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని.. నైలాన్, సింథటిక్‌ దారానికి గాజు, ప్లాస్టిక్‌ పొడి పూసి మాంజా తయారు చేస్తారు. గాజుముక్కలను ఇతర రసాయన విషాలను కలపడం వల్ల ఈ దారం కత్తిలాగా మారుతోంది. అదే ఇప్పుడు మనిషి పాలిట ఉరితాడుగా మారింది.  2017లోనే చైనా మాంజా ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ నిషేధం విధించింది. ఈ దారం పర్యావరణానికి ప్రమాదమని భావించిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా సంక్రాంతికి చైనా మాంజా విక్రయాలు ఇష్టారీతిన సాగుతున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి రహస్యంగా తీసుకొచ్చి విక్రయించేవారు. ప్రస్తుతం ఆ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఎక్కడపడితే అక్కడ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ చైనా మాంజా కారణంగా ప్రతి సంక్రాంతి సమయంలో ఎంతో మంది చనిపోతున్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ మాంజాతో పతంగులు ఎగురవేసే వారికి కూడా అనేక గాయాలవుతున్నాయి. అయినా మార్కెట్‌లో మాత్రం చైనా మాంజా విక్రయానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పోలీసులు సోదాలు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చాలామంది.. గాయపడ్డ ఘటనలు నమోదయ్యాయి. ఈ దుస్థితి నెలకొనడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల అత్యాశ, పతంగులు ఎగురవేసే వారి బాధ్యతారాహిత్యం అని చెప్పాలి.

చైనీస్ మాంజా కారణంగా పక్షుల మరణాలకు లెక్కేలేదు. గాలి పటాలు ఎగరేసినప్పుడు తెగిపోయిన మంజా దారాలు చెట్లు, కరెంట్‌ తీగలు, స్తంభాలు, ఇళ్ల మధ్య వేలాడుతూ ఉంటాయి. పక్షులు ఎగిరివచ్చి వాటిలో చిక్కుకుపోయి మృత్యువాతపడుతున్నాయి. అందులో అరుదైన పక్షులు ఉంటున్నాయని, మాంజా కారణంగా కొన్ని జాతులు అదృశ్యమైపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా బైక్స్‌ మీద వెళ్లేవారికి ఈ మాంజా కారణంగా ముప్పు ఏర్పడుతుంది. అందుకే కొందరు వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను అన్వేశిస్తున్నారు. తాజాగా గుజరాత్‌లో ఓ వాహనదారుడు.. చైనా మాంజా ముప్పు నుంచి తప్పించుకునేందుకు తన స్కూటీకి ముందు ఓ ఇనుప కడ్డీతో షీల్డ్‌లా ఏర్పాటు చేసుకున్నాడు. మా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. మాంజా తగిలితే ప్రాణం పోవడం ఖాయం. అందుకే ఈ ఏర్పాటు అంటున్నాడు. ఈ ఐడియా బాగుందని.. ఫాలో అయితే బెటర్ అని చాలామంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి 

'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!