General Election Results 2024 Updates: వారణాసిలో మోదీ, రెండు చోట్లా రాహుల్ ముందంజ.. మండీలో కంగనా ఆధిక్యం..
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ట్రెండ్స్‌పై నరాలుతెగే ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తోలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు అధికారులు. ఈ ప్రక్రియ దాదాపు అరగంటపాటూ కొనసాగనుంది. కొన్ని ప్రాంతాల్లో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన తరువాత ఈవీఎంలను లెక్కించనున్నారు కౌంటింగ్ అధికారులు.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో బీజేపీ హవా మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. వారణాసిలో ప్రధాని మోదీ హాట్రిక్ దిశగా దూసుకెళ్తున్నారు. ఈ తరుణంలో ఇండి కూటమి స్వల్పగా వెనుకబడి ఉంది. అయితే రాయబరేలీ, వాయనాడ్‌లో రాహుల్ కు స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. ఇద్దరు కీలక నేతల మధ్య హోరా హోరీగా పోరు సాగుతోంది. ఇప్పటి వరకు 54 సీట్లకు ట్రెండ్స్ వచ్చాయి. ఎన్డీయే 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండి కూటమి 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరుల ఖాతాలో 1 సీటు ఉంది. నాగ్‌పూర్ నుంచి నితిన్ గడ్కరీ ముందంజలో ఉన్నారు.
రాయ్‌బరేలీ, వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. భిల్వారా నుంచి సీపీ జోషి ఆధిక్యంలో ఉన్నారు. మండిలో కంగనా రనౌత్ లీడ్ లో కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విదిశ నుంచి బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ముందంజలో ఉన్నారు. భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థి అలోక్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఇండోర్ నుంచి బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ ఆధిక్యంలో ఉన్నారు. ఖజురహో నుంచి బీజేపీ అభ్యర్థి వీడీ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ తొలి ట్రెండ్‌లో వెనుకబడ్డారు. ఇప్పటివరకు, 93 స్థానాలకు ట్రెండ్‌లు వచ్చాయి, వీటిలో NDA 61 స్థానాల్లో, ఇండి కూటమి 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
మరిన్ని లోక్ సభ ఎన్నికల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
