Delhi: డిల్లీలో నిజంగానే 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందా.?
ఉత్తరాదిన ఈ ఏడాది ఎండలు మండుతున్నాయి. సూర్యప్రతాపానికి జనాలు అల్లాడుతున్నారు. బుధవారం ఢిల్లీ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేష్‌పుర్‌లో అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావారణ శాఖ ప్రకటించింది. 2002లో 49.2 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటివరకు అత్యధికం. దీంతో భారత వాతావరణ శాఖ స్పందిందించి. ఢిల్లీలోని ముంగేష్‌పుర్ వాతావరణ స్టేషన్‌లోని సెన్సార్ సరిగా పనిచేస్తుందో..
ఉత్తరాదిన ఈ ఏడాది ఎండలు మండుతున్నాయి. సూర్యప్రతాపానికి జనాలు అల్లాడుతున్నారు. బుధవారం ఢిల్లీ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేష్‌పుర్‌లో అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావారణ శాఖ ప్రకటించింది. 2002లో 49.2 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటివరకు అత్యధికం. దీంతో భారత వాతావరణ శాఖ స్పందిందించి. ఢిల్లీలోని ముంగేష్‌పుర్ వాతావరణ స్టేషన్‌లోని సెన్సార్ సరిగా పనిచేస్తుందో లేదో తనిఖీ చేస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం.మహాపాత్ర తెలిపారు.
ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కొలిచేందుకు 20 చోట్ల మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అందులో ముంగేష్‌పుర్‌లో అత్యధికంగా 52.9 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు చూపించదన్నారు. దేశంలో ఇంతవరకు ఈ స్థాయిలో ఉష్ణోగ్రత ఇప్పటివరకు నమోదు కాలేదన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రాల్లో 14 చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గాయని, కొన్నిచోట్ల 45-50 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. మిగతావాటితో పోలిస్తే ముంగేష్‌పుర్‌లో నమోదైన డేటా భిన్నంగా ఉందన్నారు. దీనిని ధ్రువీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఒక బృందాన్ని నియమించామని, వారు ఆ సెన్సార్‌ను పరిశీలిస్తారన్నారు. అయితే, కొన్నిసార్లు స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగానూ అధిక ఉష్ణోగత్రలు నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.