Aircraft Engine: విమానం ఇంజిన్ మనిషిని మింగేసింది.? వీడియో వైరల్..
అనుమానాస్పద స్థితిలో విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ విమానాశ్రయంలో చోటు చేసుకొంది. డెన్మార్క్‌కు ప్రయాణించేందుకు కేఎల్ 1341 విమానం పుష్‌బ్యాక్ అవుతున్న సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా ఇంజిన్ లోపలికి లాక్కొంది. అత్యంత వేగంగా తిరుగుతున్న బ్లేడ్లలో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు ఎయిర్ పోర్టు సిబ్బందా.. లేకా బయట వ్యక్తా? అనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు.
అనుమానాస్పద స్థితిలో విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ విమానాశ్రయంలో చోటు చేసుకొంది. డెన్మార్క్‌కు ప్రయాణించేందుకు కేఎల్ 1341 విమానం పుష్‌బ్యాక్ అవుతున్న సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా ఇంజిన్ లోపలికి లాక్కొంది. అత్యంత వేగంగా తిరుగుతున్న బ్లేడ్లలో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు ఎయిర్ పోర్టు సిబ్బందా.. లేకా బయట వ్యక్తా? అనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు. వెంటనే ఘటనా స్థలానికి నెదర్లాండ్స్ మిలటరీ పోలీసులు చేరుకొన్నారు. ప్రమాదవశాత్తు అతడు అందులో పడ్డాడా.. ఓ రకంగా ఆత్మహత్య చేసుకొన్నాడా అనేది కూడా తేలాల్సి ఉందని వారు వెల్లడించారు. ప్రమాదం సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని దింపేసి వారికి మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తామని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. డచ్ మీడియా సంస్థలు మాత్రం చనిపోయిన వ్యక్తి విమానయాన సంస్థ ఉద్యోగి అయి ఉంటాడని కథనాలు రాసుకొచ్చాయి. ప్రమాద సమయంలో అతడు విమానం పుష్‌బ్యాక్ పనిలో నిమగ్నమై ఉండొచ్చని తెలిపాయి. ఎయిర్ పోర్టుల్లో విమానం ఇంజిన్ సమీపంలోని వారిని లోపలికి లాగేసుకొనే ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకొంటాయి. గతేడాది కూడా అమెరికాలోని టెక్సాస్ శాన్‌ఆంటోనియో ఎయిర్ పోర్టులో ఓ ఉద్యోగిని ఇలానే విమానం ఇంజిన్ లాగేసుకొంది. ఆ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

