Lok Sabha Elections 2024: యూపీలో తెలుగు అభ్యర్థికి షాక్.. చివరి నిమిషంలో బీఎస్పీ ట్విస్ట్.. అసలు శ్రీకళారెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా..

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి బరిలో ఉందనుకున్న ఏకైక తెలుగు మహిళ శ్రీకళా రెడ్డికి చివరి నిమిషంలో షాక్ తగిలింది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీకి ముందు రోజు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి అభ్యర్థిని మార్చేశారు. నాలుగు రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేసిన శ్రీకళా రెడ్డికి బీ-ఫాం ఇవ్వకుండా శ్యామ్ సింగ్ యాదవ్‌కు పార్టీ బీ-ఫాం అందజేసింది.

Lok Sabha Elections 2024: యూపీలో తెలుగు అభ్యర్థికి షాక్.. చివరి నిమిషంలో బీఎస్పీ ట్విస్ట్.. అసలు శ్రీకళారెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా..
Shree Kala Reddy
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 06, 2024 | 5:11 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి బరిలో ఉందనుకున్న ఏకైక తెలుగు మహిళ శ్రీకళా రెడ్డికి చివరి నిమిషంలో షాక్ తగిలింది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీకి ముందు రోజు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి అభ్యర్థిని మార్చేశారు. నాలుగు రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేసిన శ్రీకళా రెడ్డికి బీ-ఫాం ఇవ్వకుండా శ్యామ్ సింగ్ యాదవ్‌కు పార్టీ బీ-ఫాం అందజేసింది. నిజానికి శ్యాం సింగ్ యాదవ్ సిట్టింగ్ ఎంపీ. 2019 ఎన్నికల్లో మోదీ వేవ్‌ను ఎదుర్కొని ఈ స్థానం నుంచి గెలుపొందారు. అయితే సిట్టింగ్ ఎంపీని కాదని, జౌన్‌పూర్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న శ్రీకళా రెడ్డిని మాయావతి అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె 4 రోజుల క్రితమే నామినేషన్ పత్రాలను కూడా సమర్పించారు. కానీ ఏం జరిగిందో ఏమో.. చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చుతున్నట్టు బీఎస్పీ ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీకే మళ్లీ టికెట్ ఖరారు చేసింది. చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కణ్ణుంచి భారతీయ జనతా పార్టీ (BJP) తరఫున మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కృపాశంకర్ సింగ్ పోటీ చేస్తుండగా, విపక్ష కూటమి (I.N.D.I.A) తరఫున సమాజ్‌వాదీ పార్టీ (SP) అభ్యర్థి బాబు సింగ్ కుష్వాహ పోటీ చేస్తున్నారు. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారా అన్న చర్చ కంటే శ్రీకళా రెడ్డికి షాక్ ఇవ్వడం గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.

శ్రీకళా రెడ్డి తెలంగాణలోని ఓ రాజకీయ వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి జితేంద్ర రెడ్డి నల్గొండ జిల్లా కోఆపరేటివ్ అధ్యక్షుడిగా, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే (ఇండిపెండెంట్)గా పనిచేశారు. శ్రీకళ తల్లి లలిత కూడా తమ సొంతూర్లో గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. నిప్పో గ్రూపు పేరుతో బ్యాటరీలు సహా వివిధ అనుబంధ వస్తువులు తయారు చేసే వ్యాపారం వీరు చేస్తున్నారు. వారి కుమార్తె శ్రీకళా రెడ్డి ఐదేళ్ల క్రితం తెలంగాణ నుంచే బీజేపీలో చేరారు. కానీ ఆ తర్వాత యూపీలో గ్యాంగ్‌స్టర్-రాజకీయవేత్త ధనుంజయ్ సింగ్‌ను పెళ్లాడిన శ్రీకళా రెడ్డి, అత్తింటికి మకాం మార్చారు. ధనుంజయ్ సింగ్ మొదటి భార్య మీనూ సింగ్ 2006లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. 2009లో జాగృతి సింగ్‌ను చేసుకున్నారు. ఆమెతో 2017లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది ప్యారిస్‌లో శ్రీకళా రెడ్డిని వివాహం చేసుకున్నారు. ధనుంజయ్ సింగ్ యూపీలోని జౌన్‌పూర్ కేంద్రంగా రాజకీయాల్లో ప్రభావవంతమైన నేతగా ఉన్నారు. అందుకే తన సతీమణి శ్రీకళ రెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి గెలుపించుకున్నాక, జౌన్‌పూల్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా చేయగలిగారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున టికెట్ సాధించినప్పటికీ.. చివరి మాయావతి చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసినందున, స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగించాలని ధనుంజయ్ సింగ్ మద్ధతుదారులు ఒత్తిడి చేశారు. రోజంతా ఇదే విషయంలో తన నివాసంలో చర్చోపచర్చలు జరిగాయి. అనంతరం ఇదే విషయంపై శ్రీకళా రెడ్డిని సంప్రదించగా.. తాను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గానే కొనసాగుతానని, ఇండిపెండెంట్‌గా పోటీలో ఉండాలన్న ఆలోచన లేదని చెప్పారు. టికెట్ నిరాకరించడంపై ప్రశ్నించగా.. ఎవరి ఒత్తిడి ఉందో తెలియదు కానీ చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బహుశా బీజేపీ ఒత్తిడి కారణంగానే తనను తప్పించి ఉండవచ్చన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.

మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు

జాన్‌పూర్‌లో 6వ దశలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. మిగతా దశల్లో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతితో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సైతం వరుసగా అభ్యర్థులను మార్చుతున్నారు. నాలుగు రోజుల క్రితం వారణాసిలో బీఎస్పీ తన అభ్యర్థిని మార్చింది. మొదట అథర్ జమాల్ లారీకి టికెట్ ప్రకటించిన బీఎస్పీ, ఆ తర్వాత అభ్యర్థిని మార్చి సయ్యద్ నేయాజ్ పేరును ప్రకటించింది. ఇప్పుడు తాజాగా నెయాజ్ స్థానంలో లారీనే అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే అమేఠీలోనూ మాయావతి అభ్యర్థిని మార్చారు. గతంలో ఇక్కడ రవి ప్రకాష్ మౌర్య పేరును ప్రకటించగా.. తాజాగా నాన్హే సింగ్ చౌహాన్‌ను అభ్యర్థిగా మాయావతి డిక్లేర్ చేశారు. రాష్ట్రంలో వేరే ఏ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చినా రాజకీయంగా అది పెద్ద చర్చనీయాంశం కాలేదు. కానీ జౌన్‌పూర్ నియోజకవర్గంలో శ్రీకళారెడ్డిని మార్చడంపై మాత్రం చర్చ జరుగుతోంది. ధనుంజయ్ సింగ్ తదుపరి కార్యాచరణ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?