Lok Sabha elections: ఐదు రాష్ట్రాల్లో ఆప్-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు.. పంజాబ్‌లో కుదరని దోస్తీ
లోక్‌సభ ఎన్నికల కోసం ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తు కుదిరింది. ఢిల్లీ సహా గుజరాత్, హర్యానా, చండీగఢ్, గోవాలో సీట్ల షేరింగ్ కొలిక్కి వచ్చింది. ఐదు రాష్ట్రాల్లో ఆప్ – కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు గానూ ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేయనుంది.
లోక్‌సభ ఎన్నికల కోసం ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తు కుదిరింది. ఢిల్లీ సహా గుజరాత్, హర్యానా, చండీగఢ్, గోవాలో సీట్ల షేరింగ్ కొలిక్కి వచ్చింది. ఐదు రాష్ట్రాల్లో ఆప్ – కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు గానూ ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేయనుంది. ఆప్ పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీలో పోటీ చేయనుంది. కాంగ్రెస్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, చాందినీ చౌక్ స్థానాల్లో బరిలో నిలవనుంది.
గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ 24 స్థానాల్లో పోటీ చేయనుంది. ఆప్‌కు రెండు స్థానాలు కేటాయించారు. భరూచ్, భావ్‌నగర్‌లో ఆప్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. హర్యానాలో మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 9 స్థానాల్లో పోటీకి దిగనుంది. ఆప్ ఒక్కస్థానం కురుక్షేత్రలో బరిలో నిలవనుంది. గోవా, చండీగఢ్ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ మాత్రమే పోటీలో నిలిచేలా ఒప్పందం కుదిరినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ముకుల్ వాస్నిక్ తెలిపారు. గోవా, చండీగఢ్ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగనుంది. గోవాలో ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, చండీగఢ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పోటీ చేయనుంది.
మరోవైపు పంజాబ్‌లో ఇరు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉండబోదని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్, ఢిల్లీలో పాత ప్రత్యర్థులైన ఆప్ – కాంగ్రెస్ గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి సుప్రీంకోర్టు జోక్యంతో విజయం సాధించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…