AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Anthem: మన జాతీయ గీతం ‘జన గణ మన’ గురించి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..

Azadi Ka Amrut Mahotsav: జన గణ మన ఈ పదాలు వింటే మన హృదయం జాతీయత, దేశభక్తితో నిండిపోతుంది. భారతీయులందరూ జాతీయ గీతాన్ని ఆలపించడం గర్వంగా భావిస్తారు. జన గణ మన జాతీయ గీతం..

National Anthem: మన జాతీయ గీతం 'జన గణ మన' గురించి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..
Janaganamana
Surya Kala
|

Updated on: Aug 11, 2021 | 2:01 PM

Share

Azadi Ka Amrut Mahotsav: జన గణ మన ఈ పదాలు వింటే మన హృదయం జాతీయత, దేశభక్తితో నిండిపోతుంది. భారతీయులందరూ జాతీయ గీతాన్ని ఆలపించడం గర్వంగా భావిస్తారు. జన గణ మన జాతీయ గీతం మన పెదవుల్లో మెదిలే తారకమంత్రం. అయితే ఈ జాతీయ గీతం ‘జన గణ మన ‘ మొదటిసారిగా డిసెంబర్ 27, 1911 లో కోల్‌కతాలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ సభలో ఆలపించారు. ఈ జాతీయ గీతాన్ని నోబెల్ బహుమతి గ్రహీత , కవి రవీంద్ర నాథ్ ఠాగూర్ బెంగాలీలో వ్రాసారు. అయినప్పటికీ సంస్కృతంలో ఎక్కువ పదజాలం ఉపయోగించారు.

* జాతీయ గీతం ఆమోదించిన సంవత్సరం 1950, జనవరి 24 * జాతీయ గీతం బాణీకి అనుగుణంగా పాడడానికి..52 సెకెండ్లు పడుతుంది. * రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని తొలిసారిగా చిత్తుప్రతిపై ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో రచించారు. * జనగణమన గీతం బెంగాలీ భాషలో ఐదు చరణాల్లో రచించారు. అందులోని తొలి ఎనిమిది లైన్లలను జాతీయగీతంగా తీసుకున్నారు. * జాతీయగీతాన్ని ‘మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’ అనే పేరుతో తిరిగి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లంలోకి అనువదించారు. తర్వాత తత్వబోధిని పత్రికలో ‘భారత విధాత’ అనే పేరుతో 1912లో ప్రచురించారు. * జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకన్ల సమయం పడితే సంక్షిప్తంగా ఆలపించడానికి 20 సెకన్లు పడుతుంది. * జాతీయ గీతం సాహిత్యం మొదట బిల్వ రాగంలో సెట్ చేయబడింది. * పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా-గీతంలోని బెంగాలీ పద్యాల్లో పేర్కొనబడినవి బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాలు. కాశ్మీర్, మైసూర్ , కేరళ వంటి రాజ్యాలు ఆ సమయంలో పోర్చుగీస్ పాలనలో ఉన్నందున చేర్చబడలేదు. *జనగణమణ గీతంలో ఐదు చరణాలు ఉంటాయి. వీటిలో మొదటి చరణం మాత్రమే దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జాతీయ గీతంగా పాడబడుతుంది. *’జన గణ మన’ నిజానికి 1919 లో భారతదేశ సందర్శన కోసం వచ్చిన ఇంగ్లాండ్ రాణి గౌరవార్థం వ్రాయబడిందని విక్టోరియా మహారాణి  గౌరవార్థం స్వరపరచి..  ఈ పాటను ఠాగూర్ పాడినట్లు ఆనాటి వార్తాపత్రికలు తప్పుడు పుకార్లు వార్తలు రాశాయి.

Also Read: Former Cricket Star: వెంటిలేటర్‌పై స్టార్ క్రికెటర్.. చిన్న తప్పుతో జీవితం కోల్పోయి.. బస్సు క్లినర్‌గా మారిన వైనం