Kerala: ప్రారంభించిన తొలిరోజే వందే భారత్‌కు మరమ్మత్తులు.. నెట్టింట రుసరుసలు
కేరళ రాజధాని తిరువనంతవరంలో ప్రధాని మోదీ మంగళవారం (ఏప్రిల్ 25) జెండా ఊపి ప్రారంభించిన తొలిరోజే వందేభారత్ రైలుకు మరమ్మత్తులు చేశారు. తిరువనంతపురం నుంచి కాసరగడ్ బయల్దేరిన ఈ ట్రెయిన్ మార్గం మధ్యలో ఏసీ గ్రిల్‌లో నీరు లీకవుతున్నట్టు..

కేరళ రాజధాని తిరువనంతవరంలో ప్రధాని మోదీ మంగళవారం (ఏప్రిల్ 25) జెండా ఊపి ప్రారంభించిన తొలిరోజే వందేభారత్ రైలుకు మరమ్మత్తులు చేశారు. తిరువనంతపురం నుంచి కాసరగడ్ బయల్దేరిన ఈ ట్రెయిన్ మార్గం మధ్యలో ఏసీ గ్రిల్‌లో నీరు లీకవుతున్నట్టు అధికారులు గుర్తించడంతో గమ్యస్థానమైన కాసర్‌గోడ్ వెళ్లాల్సిన సెమీ హైస్పీడ్ రైలు కన్నూర్ రైల్వేస్టేషనులో నిలిచిపోయింది. అధికారులు సమాచారం అందించడంతో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీకి చెందిన సాంకేతిక నిపుణులు వచ్చి మరమ్మతులు ప్రారంభించారు. ఆ తర్వాత ట్రైన్ కాసరగడ్ చేరుకుంది. మంగళవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో కాసరగడ్ నుంచి ఇది తిరిగి కన్నూర్ చేరుకుంది. వర్షం కారణంగానే ఈ కోచ్‌లో వాటర్ లీక్ అయిందని అధికారులు తెలిపారు. నీటి లీకేజీని ఆపేందుకు సిబ్బంది చేస్తున్న మరమ్మతు దృశ్యాల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వందేభారత్ రైలును ప్రారంభించిన తొలి రోజే ఇలాంటి లోపం తలెత్తడంపై పలువురు పలు రకాలుగా స్పందించారు. నాసిరకం ట్రైన్‌లను తయారు చేసి, గొప్పగా ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు తలెత్తుతున్నాయి. అయితే ఇలాంటి చిన్న చిన్న లోపాలు సహజమేనని, చిన్న విషయాన్ని పెద్దది చేయవద్దంటూ రైల్వే అధికారులు కోరుతున్నారు. వాటర్ లీకేజీపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.