పోలీసు నిరసనకారులను అరెస్టు చేయాలంటూ.. లాయర్ల వింత ‘ ప్రొటెస్ట్ ‘

  ఢిల్లీలో పోలీసులు, లాయర్లకు మధ్య ప్రారంభమైన ‘ పోరు ‘ బుధవారం మరో మలుపు తిరిగింది. (నిన్న పోలీసులు తమ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద దాదాపు 11 గంటల పాటు సుదీర్ఘ నిరసన తెలిపారు).నిన్న మొన్నటి వరకు ‘ సాధారణ రీతిలో ‘ నిరసన తెలిపిన లాయర్లు బుధవారం వెరైటీ ప్రొటెస్ట్ చేశారు. వారు పాటియాలా హౌస్, సాకేత్ జిల్లా కోర్టుల మెయిన్ గేట్లను మూసివేశారు. లిటిగెంట్లను ఈ కోర్టుల పరిధిలోకి రాకుండా అడ్డుకున్నారు… […]

పోలీసు నిరసనకారులను అరెస్టు చేయాలంటూ.. లాయర్ల వింత ' ప్రొటెస్ట్ '
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 06, 2019 | 4:56 PM

ఢిల్లీలో పోలీసులు, లాయర్లకు మధ్య ప్రారంభమైన ‘ పోరు ‘ బుధవారం మరో మలుపు తిరిగింది. (నిన్న పోలీసులు తమ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద దాదాపు 11 గంటల పాటు సుదీర్ఘ నిరసన తెలిపారు).నిన్న మొన్నటి వరకు ‘ సాధారణ రీతిలో ‘ నిరసన తెలిపిన లాయర్లు బుధవారం వెరైటీ ప్రొటెస్ట్ చేశారు. వారు పాటియాలా హౌస్, సాకేత్ జిల్లా కోర్టుల మెయిన్ గేట్లను మూసివేశారు. లిటిగెంట్లను ఈ కోర్టుల పరిధిలోకి రాకుండా అడ్డుకున్నారు… ప్రొటెస్ట్ చేసిన పోలీసులను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. రోహిణి జిల్లా కోర్టు వద్ద ఒక అడ్వొకేట్ తనపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించగా…మరొకరు కోర్టు భవనం టాప్ మీదికి చేరుకొని.. కిందకు దూకి ఆత్మగత్య చేసుకుంటానని హెచ్చరించారు. పైగా.. నగరంలోని అన్ని దిగువ కోర్టులనూ లాయర్లు బలవంతంగా మూయించివేశారు. ఒక అడ్వొకేట్.. ఖాకీల నిరసనను ఖండిస్తూ ఢిల్లీ పోలీసు చీఫ్ కి లీగల్ నోటీసు పంపాడు. ప్రొటెస్ట్ చేసినవారిని వారం లోగా అరెస్టు చేయాలనీ ఆయన డిమాండ్ చేశాడు. మీ అడ్వొకేట్లను కంట్రోల్ చేయవలసిందిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మన్నన్ మిశ్రాను ఢిల్లీ హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ఆయన రివర్స్ ‘ గేర్ ‘ వేశాడు. లాయర్లపై విరుచుకుపడాలని పోలీసులు తహతహలాడుతున్నారని, జడ్జీలకు సెక్యూరిటీని ఉపసంహరిస్తామని బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. ‘ మేం ఇండియన్లం.. పాకిస్థానీయులం కాం ‘ అని ఆయన కూడా వ్యాఖ్యానించాడు. ఒక లాయర్ పై దాడి చేసిన పోలీసుమీద ఖాకీలు ఎలాంటి చర్యా తీసుకోలేదని మన్నన్ ఆరోపించారు.