గుజరాత్ సీఎం కోసం.. ఖరీదైన విమానం.. ధర ఎంతో తెలిస్తే.. ?

ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోందని, ఆర్ధిక వృద్ది రేటు తగ్గిపోతోందని ఈ రంగ నిపుణులు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు కొన్ని రాష్ట్రాలు ఆడంబరాల కోసం విపరీతంగా సొమ్ము మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నాయి. ఉదాహరణకు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఇతర వీవీఐపీలూ ప్రయాణించడానికి రూ. 191 కోట్ల ఖరీదైన విమానాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రెండు ఇంజన్లు గల ‘ బొంబార్డియన్ ఛాలెంజర్ 650 ‘ […]

గుజరాత్ సీఎం కోసం.. ఖరీదైన విమానం.. ధర ఎంతో తెలిస్తే.. ?
Follow us

|

Updated on: Nov 06, 2019 | 8:09 PM

ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోందని, ఆర్ధిక వృద్ది రేటు తగ్గిపోతోందని ఈ రంగ నిపుణులు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు కొన్ని రాష్ట్రాలు ఆడంబరాల కోసం విపరీతంగా సొమ్ము మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నాయి. ఉదాహరణకు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఇతర వీవీఐపీలూ ప్రయాణించడానికి రూ. 191 కోట్ల ఖరీదైన విమానాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రెండు ఇంజన్లు గల ‘ బొంబార్డియన్ ఛాలెంజర్ 650 ‘ అని వ్యవహరించే ఈ ప్లేన్ మరో రెండు వారాల్లో రాష్ట్రానికి చేరుతుందట. 12 మందిని మాత్రమే తీసుకువెళ్లగల ఈ విమాన ఫ్లయింగ్ రేంజి గంటకు 7 వేల కిలోమీటర్లని తెలుస్తోంది. ప్రస్తుత బీచ్ క్రాఫ్ట్ సూపర్ కింగ్ ప్లేన్ రేంజి గంటకు కేవలం 870 కిలోమీటర్లే.. అయిదేళ్ల క్రితం బొంబార్డియర్ విమాన కొనుగోలుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని కెప్టెన్, సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ కూడా అయిన అజయ్ చౌహాన్ తెలిపారు.