AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు పాలించే హక్కులేదు.. ఆ ప్రభుత్వాలపై సుప్రీం ఫైర్

వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. దేశ రాజధాని ఢిల్లీని ఆందోళనకు గురిచేస్తున్న ఈ వాయుకాలుష్యంపై పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ.. సుప్రీం ఫైర్ అయ్యింది. మీకు ప్రజారోగ్యాల గురించి పట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని కోట్లాది మంది ప్రజలు తీవ్రమైన వాయు కాలు​ష్య ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. సంక్షేమ ప్రభుత్వం అనే భావన మీరు మర్చిపోయారా అంటూ పంజాబ్, హర్యానా రాష్ట్రాలను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. పేద ప్రజల గురించి […]

మీకు పాలించే హక్కులేదు.. ఆ ప్రభుత్వాలపై సుప్రీం ఫైర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 07, 2019 | 12:40 AM

Share

వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. దేశ రాజధాని ఢిల్లీని ఆందోళనకు గురిచేస్తున్న ఈ వాయుకాలుష్యంపై పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ.. సుప్రీం ఫైర్ అయ్యింది. మీకు ప్రజారోగ్యాల గురించి పట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని కోట్లాది మంది ప్రజలు తీవ్రమైన వాయు కాలు​ష్య ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. సంక్షేమ ప్రభుత్వం అనే భావన మీరు మర్చిపోయారా అంటూ పంజాబ్, హర్యానా రాష్ట్రాలను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. పేద ప్రజల గురించి ఆలోచించడం లేదని.. ఇది చాలా దురదృష్టకరమని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్‌ దీపక్‌ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు ప్రజల గురించి పట్టించు​కోనివారికి అధికారంలో ఉండే హక్కు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ప్రతి సారి చేసినట్లు.. ఈ సారి కూడా రైతులు పంట వ్యర్థాలను తగలబెడతారని మీకు తెలుసు కదా.. అయినా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదంటూ.. ప్రభుత్వాలపై మండిపడ్డారు. రైతులు పంట వ్యర్థాలకు నిప్పు పెడుతుంటే.. ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించింది. సమస్య నివారణ గురించి ఎందుకు ఆలోచించలేదని.. రైతుల నుంచి పంట వ్యర్థాలను సేకరించడమో, కొనుగోలు చేయడమో ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. ఈ విషయంలో మీ ప్రభుత్వాలు.. (పంజాబ్, హర్యానా ) ఫెయిల్ అయ్యారని.. ఇక సంబంధిత అధికారులను శిక్షించే సమయం వచ్చిందంటూ.. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాలను గట్టిగా హెచ్చరించింది.

అంతేకాదు.. పశువులు చనిపోతే పట్టించుకుంటారు గానీ.. మనుషుల ప్రాణాలకు విలువలేదా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోట్లాది మందికి ప్రాణసకటంగా మారిందని.. ఈ కాలుష్యంతో ప్రజలు చావాల్సిందేనా..? దీనివల్ల ఎలాంటి రోగాలు వస్తాయో ఊహించుకోవాలంటేనే కష్టంగా ఉందని.. మీకు మనుషుల ప్రాణాలంటే విలువ లేదా అంటూ ప్రశ్నిల వర్షం గుప్పించింది. కాలుష్య నివారణ కోసం.. ఆకాశంలో వెళ్లే విమానాలను దారిమళ్లించాల్సి వస్తోంది.. ప్రజలకు వారి సొంత ఇళ్లల్లోనే రక్షణ లేకుండా పోతోంది.. వీటిన్నింటిని చూస్తే.. మీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

భవంతుల్లో కూర్చొని పాలిస్తున్న ప్రభుత్వాలు.. ప్రజా సంక్షేమాన్ని మర్చిపోవడం ఆందోళనకు గురిచేస్తున్న విషయమని ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యానికి.. మీ రాష్ట్ర ప్రభుత్వాలే(పంజాబ్, హర్యానా)లే బాధ్యులంటూ పేర్కొంది. ఇరు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంపై యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.