అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేకు ‘ఎడ్డీ’ వెయ్యి కోట్లు ఎందుకిచ్చారంటే?

తను సీఎం కావడానికి ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎదియూరప్ప .. అనర్హత వేటు పడిన (మాజీ) ఎమ్మెల్యేను ‘ ప్రసన్నం ‘ చేసుకోవడానికి ‘ కోట్ల ‘ రూపాయల ‘ నజరానా ‘ ఇచ్చారట. నారాయణ గౌడ అనే ఆ సభ్యుడు తాజాగా తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో కృష్ణరాజపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తాను…. తన ఈ ప్రాంత అభివృధ్ది కోసం రూ. 700 కోట్లు కేటాయించవలసిందిగా ఎదియూరప్ప నివాసానికి వెళ్లి కోరానని, అయితే ఇంతకన్నా […]

అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేకు 'ఎడ్డీ' వెయ్యి కోట్లు ఎందుకిచ్చారంటే?
2008 నుంచి సీఎం పదవిలో మూడున్నర ఏళ్లు సీఎంగా పని చేశారు యడియూరప్ప. 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో 2008 మే 30న యడియూరప్ప రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో యడియూరప్ప పాత్రపై కర్ణాటక లోకాయుక్తా దర్యాప్తు జరిపి 2011లో నివేదిక సమర్పించింది. దీంతో బీజేపీ అధిష్ఠానం నుంచి ఆయనపై ఒత్తిడి రావడంతో మూడున్న ఏండ్ల పాలన తర్వాత 2011 జూలై 31న సీఎం పదవికి రాజీనామా చేశారు.
Pardhasaradhi Peri

| Edited By: Srinu Perla

Nov 06, 2019 | 5:09 PM

తను సీఎం కావడానికి ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎదియూరప్ప .. అనర్హత వేటు పడిన (మాజీ) ఎమ్మెల్యేను ‘ ప్రసన్నం ‘ చేసుకోవడానికి ‘ కోట్ల ‘ రూపాయల ‘ నజరానా ‘ ఇచ్చారట. నారాయణ గౌడ అనే ఆ సభ్యుడు తాజాగా తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో కృష్ణరాజపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తాను…. తన ఈ ప్రాంత అభివృధ్ది కోసం రూ. 700 కోట్లు కేటాయించవలసిందిగా ఎదియూరప్ప నివాసానికి వెళ్లి కోరానని, అయితే ఇంతకన్నా ఎక్కువగానే.. రూ. 300 కోట్లు కలిపి మొత్తం వెయ్యి కోట్లు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారని గౌడ తన సహచరులకు చెప్పారు. ఆ తరువాత ఆ హామీ నెరవేర్చారని తెలిపారు. ‘ అంతటి గొప్ప వ్యక్తికి మద్దతు ఇవ్వడంలో తప్పులేదు కదా ? అందుకే సపోర్ట్ ఇచ్చాను ‘ అని అన్నారు. ఇలాగే మాండ్యా నియోజకవర్గ ఎమ్మెల్యే కి కూడా ఎదియూరప్ప సహాయం చేశారని, ఈ విషయాన్ని ఆ శాసన సభ్యుడు స్వయంగా చెప్పారని నారాయణగౌడ గుర్తు చేశారు. అయితే.. అనర్థత వేటు పడిన ఎమ్మెల్యేలతో తనకు సంబంధం లేదని ఎడ్డీ చెప్పడం విశేషం. అయినా ఎదియూరప్ప ముఖ్యమంత్రి కావడానికి ముందే నారాయణగౌడ.. ఆయన ఇంటికి వెళ్లి తన నియోజకవర్గ అభివృధ్దికి కోట్ల సాయం చేయాలని కోరడంలోని మతలబు ఏమిటో అర్థం కావడం లేదని అంటున్నారు. అప్పటికి ఎడ్డీ సీఎం కూడా కాదు. మరి.. ‘ అనర్హ ‘ సభ్యుడికి ఒక్కసారిగా మూడు వందల కోట్లు ఎక్కువే ఇఛ్చి ‘ ప్రసన్నం ‘ చేసుకోవడంలోని ఔచిత్యమేమిటన్నది తెలియాల్సి ఉంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu