ట్రంప్ రాసలీలల్లో మరో ‘ అధ్యాయం ‘.. కోర్టుకెక్కిన మాజీ మోడల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి చేబట్టక ముందు పలువురు మోడల్స్ తో బాటు మాజీ లవర్స్ తో సాగించిన రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా సమ్మర్ జెర్వోస్ అనే మాజీ మోడల్ ఆయనపై కోర్టులో పరువునష్టం దావా వేసింది. ట్రంప్ తనపై జరిపిన లైంగిక దాడికి ఆధారాలు ఉన్నాయంటూ ఆమె.. ఆయన సెల్ ఫోన్ రికార్డులను, ఆయన ప్రయివేటు క్యాలెండర్ లోని వివరాలను కోర్టుకు సమర్పించింది. 2007 లో ట్రంప్ నుంచి తనకు కాల్ అందిందని, […]

ట్రంప్  రాసలీలల్లో మరో ' అధ్యాయం '.. కోర్టుకెక్కిన మాజీ మోడల్
Follow us

|

Updated on: Nov 06, 2019 | 1:41 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి చేబట్టక ముందు పలువురు మోడల్స్ తో బాటు మాజీ లవర్స్ తో సాగించిన రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా సమ్మర్ జెర్వోస్ అనే మాజీ మోడల్ ఆయనపై కోర్టులో పరువునష్టం దావా వేసింది. ట్రంప్ తనపై జరిపిన లైంగిక దాడికి ఆధారాలు ఉన్నాయంటూ ఆమె.. ఆయన సెల్ ఫోన్ రికార్డులను, ఆయన ప్రయివేటు క్యాలెండర్ లోని వివరాలను కోర్టుకు సమర్పించింది. 2007 లో ట్రంప్ నుంచి తనకు కాల్ అందిందని, దాంతో కాలిఫోర్నియా లోని బెవెర్లీ హిల్స్ హోటల్ కు వెళ్లిన తనపట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడని సమ్మర్ జెర్వోస్ తెలిపింది. గత నెల 24 న కోర్టు ఫైలింగ్ లో తన క్లయింటు.. ట్రంప్ నిర్వాకాలను వివరించిందని ఆమె తరఫు అటార్నీ మేరియన్ వాంగ్ తెలిపారు.

‘ ది అప్రెంటిస్ ‘ అనే రియాల్టీ షో లో కంటెస్టెంట్ గా కూడా సమ్మర్ కొన్నాళ్ళు వ్యవహరించింది. ఆ సందర్భంగా ట్రంప్ తనను కలుసుకున్నాడని ఆమె పేర్కొంది. 2016 లో అధ్యక్ష ఎన్నికకు ముందు ఆయనగారు పలువురు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అమెరికాలోని కొన్ని పత్రికలు కూడా పేర్కొన్నాయి. కాగా.. సమ్మర్ ఆరోపణలను తోసిపుచ్చిన ట్రంప్.. ఆ రియాల్టీ షో 14 సీజన్లకు తాను హోస్ట్ గా వ్యవహరించానని, అయితే ఈమె (సమ్మర్) కూడా ఓ కంటెస్టెంట్ అన్న విషయం తనకు గుర్తు లేదని అన్నాడు. ఎప్పుడో దాదాపు పదేళ్ల క్రితం ఆమెను తను ఓ హోటల్లో కలిసినట్టు చేసిన ఆరోపణను కూడా ఖండించాడు. అయితే సమ్మర్ మాత్రం ఆయనను ‘ అబధ్ధాలకోరు ‘ గా మాటిమాటికీ అభివర్ణించింది. తన జాతీయ, అంతర్జాతీయ హోదాను అడ్డుపెట్టుకుని ఆయన తప్పుడు స్టేట్ మెంట్లు ఇస్తున్నాడని దుయ్యబట్టింది. అటు-స్టామీ డేనియల్స్ , కరెన్ మెక్ డౌగల్ అనే మహిళలు కూడా ట్రంప్ పై కోర్టుకెక్కారు. ట్రంప్ మాజీ లాయర్ ఒకరు.. ట్రంప్ తరఫున తాను స్టామీ డేనియల్స్ కు లక్షకు పైగా డాలర్లను ముట్టజెప్పినట్టు అంగీకరించిన విషయం తెలిసిందే. కాగా- ఇంకా బయటపడని పలువురు మాజీ లవర్స్ ఈ దావాల విషయమై నోరు మెదపడంలేదు. ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్నట్రంప్ .. కోర్టును కూడా తప్పుదోవ పట్టించగలడని, అందువల్ల తమకు పరిహారం లభించవచ్చునేమోగానీ.. తమ హోదా, ప్రతిష్ట దెబ్బ తినడం ఖాయమని వారు భావిస్తున్నారట…