ఆ మార్పుకు మహేష్ శ్రీకారం చుడతాడా..!

కోలీవుడ్ హీరో కార్తీ ఇటీవల ఖైదీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంపై విమర్శకుల ప్రశంసలు కురిపించగా.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతోంది. ఖైదీ విడుదలైన రోజే విజయ్ బిగిల్ మూవీ వచ్చినప్పటికీ.. మార్కెట్లో కార్తీ కూడా తన సత్తాను చూపిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.80కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. దీంతో కమర్షియల్‌గానూ ఈ చిత్రం విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ మూవీని చూసిన […]

ఆ మార్పుకు మహేష్ శ్రీకారం చుడతాడా..!
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Nov 06, 2019 | 5:07 PM

కోలీవుడ్ హీరో కార్తీ ఇటీవల ఖైదీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంపై విమర్శకుల ప్రశంసలు కురిపించగా.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతోంది. ఖైదీ విడుదలైన రోజే విజయ్ బిగిల్ మూవీ వచ్చినప్పటికీ.. మార్కెట్లో కార్తీ కూడా తన సత్తాను చూపిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.80కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. దీంతో కమర్షియల్‌గానూ ఈ చిత్రం విజయం సాధించింది.

ఇదిలా ఉంటే ఈ మూవీని చూసిన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు.. కార్తీపై ప్రశంసలు కురిపించాడు. ఎలాంటి పాటలు లేకుండా ఈ చిత్రాన్ని తీశారు. ఒక గొప్ప మార్పుకు మీరు స్వాగతం చెప్పారు అంటూ మహేష్ కార్తీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఈయన మాటలను బట్టి చూస్తుంటే.. మహేష్ కూడా టాలీవుడ్‌లో ఇలాంటి మార్పుకే శ్రీకారం చుడతాడా..? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే మహేష్ బాబు ఓ కమర్షియల్ హీరో. ఆయనే కాదు ఏ స్టార్ హీరో నటించే కమర్షియల్ సినిమాల్లో పాటలు, హీరోయిన్ కచ్చితంగా ఉండాల్సిందే. అవి లేకుండా వారి సినిమాలను ఊహించుకోవడం కొంచెం కష్టమే. కానీ ఇప్పుడు ప్రేక్షకులు కూడా మారారు. కొత్తదనానికే వారు ఓటు వేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మహేష్ బాబు ఇలాంటి ప్రయోగం చేస్తే.. టాలీవుడ్‌ కూడా మరో కొత్త మార్పుకు స్వాగతం పలికినట్లే..! అంతేకాదు ప్రయోగాలు చేయడంలో ఇప్పుడున్న స్టార్ హీరోలలో మహేష్ ముందు వరుసలో ఉంటాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. కాబట్టి మహేష్ బాబు అలాంటి ప్రయోగం చేస్తే.. మిగిలిన స్టార్ హీరోలకు బూస్టప్ ఇచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu