AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్‌ షూటింగ్‌కు కేంద్రమంత్రి సాయం.. అసలేమైందంటే..!

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఓ కేంద్రమంత్రి సాయం చేశారు. ఆయనకు ఓ బుల్లెట్ ఫ్రూప్ వాహనం కూడా ఇచ్చారు. ఇది ఎప్పుడో జరగ్గా.. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు మహేష్‌కు సాయం చేసిన కేంద్ర మంత్రి ఎవరు..? ఏ సాయం చేశారు..? అనుకుంటున్నారా..! మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్నాడు ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపిస్తుండగా.. ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీన్లను […]

మహేష్‌ షూటింగ్‌కు కేంద్రమంత్రి సాయం.. అసలేమైందంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 06, 2019 | 5:32 PM

Share

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఓ కేంద్రమంత్రి సాయం చేశారు. ఆయనకు ఓ బుల్లెట్ ఫ్రూప్ వాహనం కూడా ఇచ్చారు. ఇది ఎప్పుడో జరగ్గా.. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు మహేష్‌కు సాయం చేసిన కేంద్ర మంత్రి ఎవరు..? ఏ సాయం చేశారు..? అనుకుంటున్నారా..!

మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్నాడు ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపిస్తుండగా.. ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీన్లను కశ్మీర్‌లో చిత్రీకరించారు. అయితే అదే సమయంలో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుండటం.. రేపే మాపో రద్దు చేయడం ఖాయమనే ప్రచారం జరిగింది. దీంతో తమ షూటింగ్‌కు ముందస్తు అనుమతులు తీసుకుందట చిత్ర యూనిట్. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి ప్రత్యేక అనుమతులు తీసుకుందట సరిలేరు నీకెవ్వరు టీమ్.

ఈ క్రమంలో ఈ టీమ్ కోసం ప్రత్యేకంగా భారత ఆర్మీకి చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రాజ్‌నాథ్ సింగ్ కల్పించారట. అలాగే వేకువజామున 5గంటల నుంచి ఉదయం 10గంటల లోపు షూటింగ్ చేసుకోవాలని చెప్పారట. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయని మహేష్ టీమ్.. ఆగష్టు 4లోపు అక్కడ షూటింగ్‌ను పూర్తి చేసుకొని వచ్చేసింది. ఇక ఆ మరుసటి రోజు ఆర్టికల్ 370 రద్దు అయి.. ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఒకవేళ ఆయన అప్పుడు సహాయం చేయకపోతే.. ఈ సినిమా షూటింగ్ ఆలస్యమయ్యేదని.. అందుకు టీమ్ రాజ్‌నాథ్‌కు ప్రత్యేక కృతఙ్ఞతలు చెప్పిందని తెలుస్తోంది.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక నటిస్తుండగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, సంగీత తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!