AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: దారుణంగా చంపేసి ఆపై శవాలతో.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 9.6 రేటింగ్ మూవీ

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు అందుకుంది. కంటెంట్ పరంగానూ మెప్పించింది. అంతేకాదు ఐఎమ్ డీబీలో 9.0, బుక్ మై షోలో 9.6 రేటింగ్స్ అందుకుంది.

OTT Movie: దారుణంగా చంపేసి ఆపై శవాలతో.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 9.6 రేటింగ్ మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 19, 2026 | 8:12 PM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జూన్ 19) కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, మలయాళం, తమిళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.. మోహన్ లాల్ దృశ్యం 3, రేజర్, అతిరథి, మరీచిక, థ్యాంక్యూ సుబ్బారావు, సేవ్ ది టైగర్స్ సీజన్ 3 వంటి సినిమాలు ఇప్పుడు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. వీటితో పాటే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా శుక్రవారం మే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ట్రెండింగ్ జానర్ అయిన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. పాజిటివ్ రివ్యూలతో పాటు కంటెంట్ పరంగానూ ఈ సినిమాకు ప్రశంసలు వచ్చాయి. అయితే పేరున్న నటీనటులు లేకపోవడం, ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడం వల్ల ఈ సినిమా త్వరగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఇందులో సస్పెన్స్, మిస్టరీ, డ్రామా, క్రైమ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఒక సైకో కిల్లర్ పక్కా ప్లాన్ తో హత్యలు చేయడం, ఆపై అవే శవాలతో పెయింటింగ్ వేయడమన్నది సినిమలో ఇంట్రెస్టింగ్ పాయింట్. చివరి నిమిషం వరకు కిల్లర్ ఎవరనేది తెలియకుండా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు డైరెక్టర్. అలాగే ట్విస్టులు కూడా ఎవరూ ఊహించలేనివిధంగా ఉంటాయి.

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు బాగా నచ్చే ఈ సినిమా పేరు ఎమ్4ఎమ్ మోటివ్ ఫర్ మర్డర్ (‘M4M’ Motive For Murder). ప్రముఖ దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ సినిమాలో అమెరికన్ నటి జో శర్మ మెయిన్ లీడ్ పోషించింది. అలాగే సంబీత్ ఆచార్య హీరోగా నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోతో పాటు లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోనూ ఎమ్4ఎమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం రెంటల్ విధానంలో మాత్రమే ఈ మూవీని చూడవచ్చు. అయితే లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో మాత్రం సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లందరూ ఈ మూవీని ఉచితంగా చూడవచ్చు. కాగా ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు 9.0 రేటింగ్ ఉండగా, బుక్ మై షోలో ఏకంగా 9.6 రేటింగ్ రావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్..

ఎమ్4ఎమ్ మోటివ్ ఫర్ మర్డర్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us