Puneeth Rajkumar: కన్నడ కన్నీటి నీరాజనం.. పునీత్‌రాజ్‌కు కర్నాటక సర్కార్ సత్కారం..
న్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని ఇప్పటికీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. తమ గుండెల్లో గూడు కట్టుకున్న స్టార్‌కి అంతే..
Puneeth Rajkumar Karnataka Ratna Award: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని ఇప్పటికీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. తమ గుండెల్లో గూడు కట్టుకున్న స్టార్‌కి అంతే స్థాయిలో నివాళులు అర్పిస్తున్నారు. ప్రభుత్వ పరంగా బెంగళూరులో జరిగిన సంతాప సభలో ప్రభుత్వ పెద్దలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంతాప సభకు పలువురు కన్నడ నటీ నటులతో పాటు.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీమా పరిశ్రమల ప్రముఖులు హాజరయ్యారు. అయితే.. ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించారు CM బసవరాజు బొమ్మై. దేశంలోనే పవర్‌ఫుల్ అవార్డ్ అయిన కర్నాటక రత్న అవార్డును పునీత్‌కు నివాళిగా ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
పునీత్‌రాజ్‌కు కర్నాటక రత్న అవార్డు
బెంగళూరు నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చేతుల మీదుగా కర్ణాటక రత్న అవార్డును ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, పునీత్ రాజ్ కుమార్‌లు ప్రకటించారు. ‘పునీత్, మా అందరికీ ప్రియమైన నటుడు.. పునీత్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. కర్ణాటక నుంచి బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక బాలుడు పునీత్. చిన్నప్పటి నుంచి అద్భుతంగా నటించేవాడు. ఇంత చిన్న వయసులో అలా నటించడం అంత సులువు కాదు’’ అని బొమ్మై అన్నారు.
కర్ణాటక రత్న..
భారతరత్న జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారం కాగా.. కర్ణాటక రత్న ఆ రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పురస్కారం. రాష్ట్ర స్థాయిలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు. కర్ణాటక రత్న అవార్డును 1992లో స్థాపించారు. వీరిలో ఎనిమిది మందికి మాత్రమే కర్ణాటక రత్న అవార్డు లభించింది. మరణానంతరం ఈ అవార్డును అందుకున్న 10వ వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. అవార్డుతోపాటు బహుమతిలో 50 గ్రాముల బంగారు పతకం, కృతజ్ఞతా పత్రం అందిస్తారు.
ఇవి కూడా చదవండి: CM KCR: రైతు దీక్షకు సీఎం కేసీఆర్..? కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం..
Onion Face Pack: ఉల్లిపాయ ఫేస్‌ప్యాక్.. ఇలా చేస్తే తళుక్కుమనే అందం మీ సొంతం..