AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KS Eshwarappa: మంత్రి ఈశ్వరప్ప రాజీనామా.. ఇతర పార్టీలకు కలిసివస్తుందా..? అసలు బీజేపీ ప్లాన్ ఏంటీ

KS Eshwarappa quits as Karnataka minister: కర్ణాటకలో రాజకీయాలు రోజుకో విధంగా మలుపుతిరుగుతున్నాయి. ఈ క్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్‌ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

KS Eshwarappa: మంత్రి ఈశ్వరప్ప రాజీనామా.. ఇతర పార్టీలకు కలిసివస్తుందా..? అసలు బీజేపీ ప్లాన్ ఏంటీ
Ks Eshwarappa
Shaik Madar Saheb
|

Updated on: Apr 16, 2022 | 9:21 AM

Share

KS Eshwarappa quits as Karnataka minister: కర్ణాటకలో రాజకీయాలు రోజుకో విధంగా మలుపుతిరుగుతున్నాయి. ఈ క్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్‌ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి ఈశ్వరప్ప వేధింపులతోనే కాంట్రాక్టర్ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో ఈ విషయంపై కర్ణాటకలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈశ్వరప్ప గురువారం సాయంత్రం తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి అందించారు.

అయితే.. బీజేపీ సీనియర్‌ నేత కేఎస్‌ ఈశ్వరప్పకు.. రాజీనామా చేయాలని కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి రాలేదని ముఖ్యమంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేశారని, ప్రతిపక్ష కాంగ్రెస్ చేసిన డిమాండ్‌కు ప్రతిస్పందనగా కాదంటూ ముఖ్యమంత్రి బొమ్మై పేర్కొన్నారు . అయితే.. మంత్రి రాజీనామా కోసం పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి సహా పలువురు రంగంలోకి దిగినట్లు సమాచారం.. రాజీనామాకు ముందు మంత్రిని ఒప్పించేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు చేశారు.. అయితే ఈశ్వరప్ప రాజీనామాకు పెద్దగా కారణం కూడా కనిపించడం లేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా.. రాష్ట్రంలో ఇంకా ఏడాదిన్నర వ్యవధిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార బీజేపీ (భారతీయ జనతా పార్టీ) కి పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. కాంట్రాక్టర్ మరణంతో మంత్రి ఈశ్వరప్ప పదవికి రాజీనామా చేశారన్న విషయం అందరికీ తెలుసు. అయితే ప్రతిపక్షాలు దీనిని క్యాచ్ చేసుకోకుండా నిరోధించడానికి బీజేపీ నాయకత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే.. ఇది కూడా ఆలస్యం అయినట్లు పలువురు పేర్కొంటున్నారు.

అంతకుముందు కూడా..

మంత్రులపై ఆరోపణలు చేయడం కర్ణాటకకు కొత్త కాదు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే జరిగింది. కెజె జార్జ్‌పై కూడా ఇలాంటి అభియోగాలే ఉన్నాయి. ఆయన కూడా ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత రాజీనామా చేశారు. అయితే.. విచారణ అధికారులు ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడంతో మళ్లీ మంత్రివర్గంలోకి వచ్చారన్నది మరో విశేషం. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈశ్వరప్ప మంత్రివర్గ సహచరుడు – రమేష్ జార్కిహోళి కూడా వీడియో వైరల్ అయ్యాక రాజీనామా చేశారు.

చర్య తీసుకోవడంలో ఏ మాత్రం జాప్యం చేసినా అధికార పక్షానికి ముప్పులా ఉంటుంది. ఇది ప్రతిపక్షాలకు ఆయుధంలా మారుతుంది. కావున ముందే పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాంట్రాక్టర్ విషయం అదేవిధంగా.. కమీషన్ కోసం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు తెలెత్తుతాయి. కమీషన్ల వ్యవహారంపై కాంట్రాక్టర్ల సంఘం చేసిన ఆరోపణలు రాజకీయాలను మరింత వేడెక్కించాయి. అధికారంలో ఉన్న మరికొందరు కూడా కమీషన్ల కోసం ఇబ్బందులు పెడుతున్నారని.. అలాంటి వారి పేర్లు బయటపెడతామని కాంట్రాక్టర్లు బెదిరించారు. ఇది పార్టీలో కలకలం రేపాయి. దీనితో అయినా అధికారంలో ఉన్నవారికి కనువిప్పు కలగాలి.

ఎన్నికలు – రాజీనామా

ఎన్నికల-సంవత్సరంలో ఈ రాజీనామా ఏమిటి? దర్యాప్తు ఎంత త్వరగా, పారదర్శకంగా, న్యాయంగా జరుగుతుందనేది నిశితంగా పరిశీలిస్తుంటారు. అధికార పక్షం తన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ప్రతిపక్షం తెరపైకి వచ్చి ఉండవచ్చు. అయినప్పటికీ ఈ సమస్య ప్రభుత్వానికి – అధికార పార్టీకి రాజకీయంగా పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇది ఇంకొంత కాలం తలనొప్పిగా మారే అవకాశముంది. మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ప్రతిపక్షం నైతిక విజయం సాధించిందని చెప్పవచ్చు. అయినప్పటికీ వారు ఇంతకు ముందు చేసిన రాజకీయాలు కూడా ఇలానే ఉన్నాయని చూపిస్తోంది.

ఈశ్వరప్ప ప్రభుత్వంలోని సీనియర్ నాయకులలో ఒకరు. అయన్ను విస్మరించడం కూడా తగదు. అతను తన పార్టీ రాష్ట్ర నాయకులతో తరచుగా పోటీ పడుతుండేవారు. దీంతోపాటు పలు వివదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. పార్టీలో ప్రాబల్యం లేని వెనుకబడిన కులాల నాయకులలో ప్రముఖుడు కూడా. ఈ వివాదం వల్ల రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనేది జాగ్రత్తగా అంచనా వేయాలి. ఇంతకుముందు కూడా యడ్యూరప్ప ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు.. ఈశ్వరప్ప అతనితో తరచూ గొడవలు పడేవారు. ఇది కుల కోణంలోకి వెళ్లింది. ఒక దశలో పార్టీలో లింగాయత్‌ల ఆధిపత్య ఉనికికి ప్రతిఘటనగా ఈశ్వరప్ప తన కుల అనుచరులకు రాజకీయేతర వేదికను కూడా సిద్ధం చేశారు. ఈశ్వరప్పను కట్టడి చేసేందుకు పార్టీ కేంద్ర నాయకత్వం జోక్యం అవసరమని భావించింది.

ఓబీసీ ఓటు బ్యాంకే ఆధారం..

కర్నాటకలో ఆధిపత్యం లేని వెనుకబడిన కులాలు ఒక ముఖ్యమైన రాజకీయ శక్తిగా ఉన్నాయి.. 2013లో కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య అహిందా బ్యానర్ కింద ఈ గ్రూపుల మద్దతును పెంచుకోగలిగారు. ఐదేళ్ల తర్వాత 2018లో, CSDS-Lokniti పోస్ట్ పోల్ సర్వే డేటా ప్రకారం కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న OBC ఓట్లు BJP వైపు మళ్లడం.. BJPని అతిపెద్ద పార్టీగా అవతరించడంలో కీలకంగా మారింది. ఈశ్వరప్ప కూడా సిద్ధరామయ్య కురుబాల కులానికే చెందినవారు. ఆధిపత్యం లేని ఓబీసీ ఓట్లను చీల్చడంలో తాజా వివాదం ప్రభావంపై రాజకీయ పార్టీలు వ్యూహరచన చేయవచ్చు. ఈశ్వరప్ప తన పక్షాన ఎలాంటి తిరుగుబాటు చేయకుండా.. శాంతింపజేయడం కూడా బీజేపికి మంచిది.

ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ప్రయత్నం డ్యామేజ్ కంట్రోల్ మోడ్‌లో ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ దీనిని వాడుకునేందుకు అవకాశంగా చూస్తుంది. ఇలాంటి పరిణామాల మధ్య.. ఈ ఏడాది జరిగే ఎన్నికలు ఎలాంటి రాజకీయాలకు తెరలేపుతాయనేది ఆసక్తికరంగా ఉంటుంది.

Also Read:

British Strategy: భారత్‌లో బ్రిటీష్ స్ట్రాటజీని అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం.. సంజయ్ ఝా సంచలన విశ్లేషణ..

CM KCR Delhi Tour: మరోసారి హస్తినకు వెళ్లనున్న సీఎం కేసీఆర్.. అసలు కారణం ఇదేనా?..