CM KCR Delhi Tour: మరోసారి హస్తినకు వెళ్లనున్న సీఎం కేసీఆర్.. అసలు కారణం ఇదేనా?..
CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ తగ్గేదేలే అంటున్నారు. బీజేపీ టార్గెట్‌గా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు గులాబీ దళపతి. మొన్నటికి మొన్న
CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ తగ్గేదేలే అంటున్నారు. బీజేపీ టార్గెట్‌గా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు గులాబీ దళపతి. మొన్నటికి మొన్న ఢిల్లీలో సమరశంఖం పూరించిన గులాబీ బాస్.. మరోసారి హస్తిన టూర్‌కు సమాయత్తమవుతున్నారు. దీంతో సీఎం వరుస హస్తిన పర్యటనలు హాట్‌టాపిక్‌గా మారాయి. మొన్ననే హస్తినకు వెళ్లిన సీఎం కేసీఆర్.. మరో రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లబోతున్నారు. వారం రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. రైతు ఉద్యమకారులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కొత్త వ్యవసాయ పాలసీపై చర్చలు జరుపనున్నారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లనున్నారు. లఖింపూర్ ఇన్సిడెంట్‌లో చనిపోయిన రైతుల కుటుంబాల్ని పరామర్శించనున్నారు సీఎం. బాధిత రైతు కుటుంబాలకు సాయం చేసే అవకాశం కూడా ఉంది. ఉద్యమంలో చనిపోయిన రైతులకు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని గతంలోనే ప్రకటించారు కేసీఆర్.
రైతు ఉద్యమం తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైదరాబాద్ వేదికగా సమావేశం నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని మొన్నటి ప్రెస్‌మీట్‌లో స్పష్టంగా చెప్పారు కేసీఆర్. జాతీయ రాజకీయాలు, పరిణామాల్ని దగ్గరగా పరిశీలిస్తున్న గులాబీ బాస్.. కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కలిసివచ్చే పార్టీలతో ముందుకెళ్లాలన్న భావనలో ఉన్నారు.
మొన్నటిదాకా.. టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య వరి వార్ గట్టిగానే సాగింది. ఇరుపార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో మాటలు నడిచాయి. వడ్లు కొనాల్సిందేనంటూ ఉద్యమాన్ని నడిపింది టీఆర్‌ఎస్. ఢిల్లీ వేదికగా నిరసనకు దిగారు కేసీఆర్. కేంద్రం దిగిరాకపోవడంతో చివరకు ధాన్యం కొనుగోలుకు ముందుకొచ్చింది తెలంగాణ సర్కారు. ఇప్పుడిప్పుడే వరి యుద్ధం చల్లారుతున్న వేళ.. కేసీఆర్ ఢిల్లీ పర్యటన మళ్లీ రాజకీయ సెగలు రేపుతోంది.
Also read:
IPl 2022: వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్.. ఏడు వికెట్ల తేడాతో కోల్‌కత్తాపై గెలుపు..