AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pub Drugs Case: ఇలాగైతే ఎలా? మిగిలిన రెండ్రోజుల్లో అయినా సమాచారం రాబట్టేనా?..

Pub Drugs Case: హైదరాబాద్‌లో సంచలనం రేపిన పుడింగ్‌ అండ్‌ మింక్‌ డ్రగ్స్ కేసులో రెండు రోజుల పాటు నిందితులను కస్టడీకి తీసుకుని విచారించారు పోలీసులు.

Pub Drugs Case: ఇలాగైతే ఎలా? మిగిలిన రెండ్రోజుల్లో అయినా సమాచారం రాబట్టేనా?..
Pub
Shiva Prajapati
|

Updated on: Apr 16, 2022 | 5:32 AM

Share

Pub Drugs Case: హైదరాబాద్‌లో సంచలనం రేపిన పుడింగ్‌ అండ్‌ మింక్‌ డ్రగ్స్ కేసులో రెండు రోజుల పాటు నిందితులను కస్టడీకి తీసుకుని విచారించారు పోలీసులు. అయితే ఈ డ్రగ్స్‌ దందాపై ఇప్పటి వరకు నిందితులు నోరు మెదపలేదని తెలుస్తోంది. దీంతో మరో రెండు రోజుల విచారణ మిగిలి ఉండటంతో చివరి రెండు రోజుల్లో కీలక విషయాలను రాబట్టాలని భావిస్తున్నారు. అయితే, రెండో రోజూ విచారణకు పబ్‌ మేనేజర్ అనిల్ సహకరించలేదని తెలుస్తోంది. అనిల్ నోరు తెరిస్తేనే డ్రగ్స్ డొంక కదులుతుంది. మరోవైపు ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతర్‌ చేస్తూ మైనర్లను కూడా అనుమతిస్తున్నాయి హైదరాబాద్‌ పబ్స్‌.

పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ మేనేజర్‌ అనిల్‌కు డ్రగ్ పెడ్లర్స్‌తో నేరుగా పరిచయాలు ఉన్నట్టు భావిస్తున్నారు పోలీసులు. మొబైల్‌లో ఉన్న కోడ్ లాంగ్వేజ్‌పై నోరు మెదపలేదు అనిల్. ఆ రోజు 15 మంది డ్రగ్స్ పార్టీకి అనిల్ ప్లాన్ చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. మరోవైపు పబ్‌లో డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు ఓనర్ అభిషేక్. తనకు వచ్చిన కాల్స్ అన్ని క్యాజువల్ కాల్స్ అని చెబుతున్నాడు. అయితే.. అభిషేక్, అనిల్ మధ్య జరిగిన వాట్సాప్ కాల్స్‌పై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అనిల్, అభిషేక్ బ్యాంక్ ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీల డిటైల్స్‌ను అరా తీశారు పోలీసులు. అనిల్‌ కస్టడీకి ఇంకా రోజుల గడువు ఉంది. ఆ లోపు అతను నోరు విప్పితేనే డ్రగ్స్ డొంక బయటపడే అవకాశం ఉంది.

ఇక పబ్బుల్లో గబ్బుపై ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. అయినా అంతా పబ్ యాజమాన్యాల ఇష్టారాజ్యంగా ఉంది. మైనర్లను పబ్‌లలోకి అనుమతించకూడదన్న నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. పబ్‌లలో మైనర్ల మస్తీని ఆధారాలతో బయటపెట్టింది టీవీ9 నిఘా టీమ్. ప్రభుత్వం ఎన్ని వార్నింగ్స్‌ ఇస్తున్నా బేఖాతర్‌ అన్నట్టున్నాయి పబ్‌లు. పబ్‌లలోకి 21 ఏళ్లు నిండని వారికి అనుమతి లేదు. అయినా గ్రాండ్‌ వెల్‌కం ఇచ్చే ధోరణిలో ఉన్నారు పబ్బు ఓనర్లు. కాసుల కక్కుర్తితో రూల్స్‌ని తుంగలో తొక్కుతున్నారు. పబ్‌ల సీసీ కెమెరాలను ఎక్సైజ్‌ శాఖకు అనుసంధానం చేస్తామంటోందని ప్రభుత్వం. ఇదెంత వరకు కట్టడి చేస్తుందో చూడాలి.

Also read:

IPl 2022: వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్.. ఏడు వికెట్ల తేడాతో కోల్‌కత్తాపై గెలుపు..

Pakistan: కొత్త ప్రభుత్వం కొలువు దీరినా పాక్‌లో చల్లారని మంటలు.. సైన్యానికి, ప్రధానికి వ్యతిరేకంగా ఇమ్రాన్‌ మద్దతుదారుల ఆందోళనలు..

Viral Video: చ‌నిపోయాడ‌ని పూడ్చిపెట్టారు.. కానీ 24 గంట‌ల్లోనే ఇంటికి తిరిగొచ్చాడు.. చూసి ఫ్యూజులు ఔట్..