Telangana Paddy Centres: తెలంగాణలో ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు.. పొరుగు రాష్ట్రాల ధాన్యానికి ‘చెక్’..!
Telangana Paddy Centres: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఇతర రాష్ట్రాల ధాన్యం ఇక్కడికి రాకుండా గట్టి చర్యలు తీసుకుంది ప్రభుత్వం.

Telangana Paddy Centres: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఇతర రాష్ట్రాల ధాన్యం ఇక్కడికి రాకుండా గట్టి చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన 48 గంటల్లోనే తెలంగాణ అంతటా ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలో 36 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో వారం రోజులుగా వరి కోతలు మొదలయ్యాయి. దీంతోపెద్ద ఎత్తున మార్కెట్లోకి వరి ధాన్యం వచ్చే ఛాన్స్ ఉండటంతో యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
వరి ధాన్యం కొనుగోళ్లతో రాష్ట్ర ఖజానాపై దాదాపు 5 వేల కోట్లు అదనంగా భారం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ కొనుగోళ్ల విషయంలో వెనకడుగు వేసేదే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌ల ఏర్పాటుతో ఏపీ పంట రాష్ట్రంలోకి రాకుండా అధికారులు చెక్‌పెడుతున్నారు. ఏపీలో తక్కువ ధరకు పంటను కొని.. తెలంగాణలో ఎక్కువకు అమ్ముకునేందుకు వ్యాపారులు చేస్తున్న ప్రయత్నానికి అడ్డుకట్ట వేస్తున్నారు.
తెలంగాణకు సరిహద్దుగా ఉన్న వాడపల్లి, రామాపురం, నాగార్జున సాగర్‌లలో ప్రభుత్వం చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఏపీ నుంచి వస్తున్న వాహనాలను తనిఖీలు చేసి ధాన్యం ఉన్న వెహికిల్స్‌ను వెనక్కి పంపుతున్నారు. అటు కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ల నుంచి సరుకు వచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణ నలుదిక్కులా 51 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
Also read:
Migraine Relief Tips: ఈ ఐదు యోగాసనాలు మైగ్రేన్ మరియు తలనొప్పి నుండి బయటపడటానికి సహాయపడతాయి
Hair Care Tips: జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారా? ఉల్లిపాయ నూనెతో ఇలా చేయండి..
Viral Video: 71 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటున్న బామ్మ.. ఏకంగా 11 రకాల వెహికిల్ లైసెన్స్‌లు పొంది..
