Slow Traffic City: భారతదేశంలో అత్యంత తక్కువ ట్రాఫిక్‌ ఉన్న నగరం ఏది? హైదరాబాద్‌ ఏ స్థానంలో..

Slow Traffic City: ప్రపంచంలో రెండవ అతి తక్కువ ట్రాఫిక్ ఉన్న నగరం. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉన్న ట్రాఫిక్ ఉన్న నగరాలకు సంబంధించి ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. ఈ జాబితాలో బెంగుళూరు, పూణేతో సహా భారతదేశంలోని అనేక నగరాల పేర్లు ఉన్నాయి. ఇందులో ప్రపంచంలో రెండవ అతి తక్కువ ట్రాఫిక్ ఉన్న నగరం కూడా ఉంది..

Slow Traffic City: భారతదేశంలో అత్యంత తక్కువ ట్రాఫిక్‌ ఉన్న నగరం ఏది? హైదరాబాద్‌ ఏ స్థానంలో..
Follow us
Subhash Goud

|

Updated on: Jan 14, 2025 | 6:55 PM

అత్యంత ట్రాఫిక్‌ ఉన్న నగరాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి నగరాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్‌ లేని నగరం కూడా ఉంది. అలాగే భారతదేశంలో అతి తక్కువ ట్రాఫిక్ ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు, పూణే కంటే ముందు మరొక నగరం కూడా ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతి తక్కువ ట్రాఫిక్ ఉన్న నగరం. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉన్న ట్రాఫిక్ ఉన్న నగరాలకు సంబంధించి ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. ఈ జాబితాలో బెంగుళూరు, పూణేతో సహా భారతదేశంలోని అనేక నగరాల పేర్లు ఉన్నాయి. ఇందులో ప్రపంచంలో రెండవ అతి తక్కువ ట్రాఫిక్ ఉన్న నగరం కూడా ఉంది.

అతి తక్కువ ట్రాఫిక్ ఉన్న నగరం:

నెదర్లాండ్స్‌లో ఉన్న లొకేషన్ టెక్నాలజీ కంపెనీ టామ్‌టామ్ తన వార్షిక సర్వేను సమర్పించింది. ఈ సర్వేలో ప్రపంచంలోని పెద్ద నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితి ఆధారంగా తక్కువ ట్రాఫిక్‌ ఉన్న నగరాల జాబితా తయారు చేసింది. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2024 ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత నెమ్మదైన నగరం కొలంబియాలోని బారన్‌క్విల్లా.

దీని తరువాత ప్రపంచంలోని రెండవ అత్యంత నెమ్మదిగా ఉన్న నగరం భారతదేశంలోని కోల్‌కతా. ఈ సర్వే ప్రకారం.. కర్ణాటకలోని బెంగళూరు ప్రపంచంలో మూడవ స్థానంలో, మహారాష్ట్రలోని పూణే నాల్గవ స్థానంలో ఉన్నాయి. ఈ విధంగా, జాబితాలో కోల్‌కతా భారతదేశంలోనే అత్యంత తక్కువ ట్రాఫిక్‌ ఉన్న నగరం. బెంగళూరు, పూణేల కంటే ఇది తక్కువగా ఉంటుంది.

10 కిలోమీటర్లు వెళ్లడానికి చాలా సమయం:

కోల్‌కతాలో పీక్ అవర్ సమయంలో 10 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి సగటున 34 నిమిషాల 33 సెకన్లు పడుతుందని టామ్‌టామ్ అధ్యయనం పేర్కొంది. ఈ విధంగా పీక్ అవర్స్‌లో ఏడాది మొత్తంలో 110 గంటలుగా నమోదైందని సర్వే తెలిపింది. బెంగళూరులో ఈ సమయం 34 నిమిషాల 10 సెకన్లు, పూణేలో ఇది 33 నిమిషాల 22 సెకన్లు కాగా, బెంగళూరులో ఏడాదికి 117 గంటలు, పూణేలో 108 గంటలు సమయం సమయంగా గుర్తించింది.

భారతదేశంలోని ఈ మూడు నగరాల తర్వాత, నిదానంగా ఉన్న నగరాల్లో, హైదరాబాద్ నాల్గవ స్థానంలో, చెన్నై ఐదవ స్థానంలో, ముంబై ఆరో స్థానంలో, అహ్మదాబాద్ ఏడవ స్థానంలో, న్యూఢిల్లీ 10వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ 18వ స్థానంలో, చెన్నై 31వ స్థానంలో, ముంబై 39వ స్థానంలో, అహ్మదాబాద్ 43వ స్థానంలో, ఢిల్లీ 122వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత తక్కువ ట్రాఫిక్‌గా ఉన్న నగరాలలో లండన్, క్యోటో, లిమా, డబ్లిన్ వంటి నగరాలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి