AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jallikattu 2025: జల్లికట్టు పోటీల్లో అపశృతి.. ఒకరు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం..

ఎద్దులు కాళ్లు దువ్వాయి. కొమ్ములు ఎగిరేశాయి. ఎద్దుల కొమ్ములు వంచి కొందరు కుర్రాళ్లు దమ్ముచూపిస్తే... మరికొందరు గాయపడ్డారు. అవనియాపురం జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది.. ఎద్దు దాడిలో ఓ యువకుడు మరణించాడు.. విలంగుడికి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తిపై ఎద్దు దాడి చేసింది..

Jallikattu 2025: జల్లికట్టు పోటీల్లో అపశృతి.. ఒకరు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం..
Jallikattu 2025
Shaik Madar Saheb
|

Updated on: Jan 14, 2025 | 6:19 PM

Share

తమిళనాడును జల్లికట్టు ఫీవర్‌ ఊపేస్తోంది. మదురై జిల్లాలో జల్లికట్టు సంబరాలు అంబరాన్ని తాకాయి. రంకెలు వేస్తున్న పోట్లగిత్తలను లొంగదీసేందుకు కుర్రాళ్లు ప్రయత్నించారు. పోటీల్లో వెయ్యికిపైగా ఎద్దులు పాల్గొన్నాయి. వాటిని లొంగదీసేందుకు 900 మంది యువకులు రంగంలోకి దిగారు. జల్లికట్టు ప్రారంభంలోనే వందలాది ఎద్దులు ముందుకు దూసుకుపోయాయి. వాటిని లొంగదీసుకోవడానికి యువకులు నానా తంటాలు పడ్డారు. ఎద్దు వెనుక ఉన్న పెద్ద మూపురాన్ని పట్టుకుని దానిని ఆపడానికి యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఎద్దులు, యువకుల మధ్య వీర లెవెల్లో సమరం సాగింది. ప్రతి రౌండ్‌లో 50 మంది ఎద్దుతో కుస్తీ పడ్డారు.

తమిళనాడు మదురై జిల్లాలో జల్లికట్టు పోటీలు జోరుగా జరిగాయి.. అవనియాపురం జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది.. ఎద్దు దాడిలో ఓ యువకుడు మరణించాడు.. విలంగుడికి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తిపై ఎద్దు దాడి చేసింది.. తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ 12 మందికి తీవ్రగాయ్యాలయ్యాయి.. మధురైలో 25 మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. పాలమేడు, అవనియాపురం, అలంకనల్లూరులో జల్లికట్టు పోటీలు జరిగాయి.. ఈ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో గాయపడినట్లు పేర్కొంటున్నారు.

కాగా.. జల్లికట్టు పోటీ ప్రారంభం కావడానికి ముందు, అధికారులు ఎద్దులతో పాటు యువకులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఎద్దులను లొంగదీసిన వాళ్లకు, వీరులకు పట్టుబడకుండా తప్పించుకున్న ఎద్దుల యజమానులకు బహుమానాలు అందజేశారు. ఈ వేడుకకు పోలీసులతో భారీ భద్రత కల్పించారు. ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు.

అయితే నిర్వాహకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోటీల్లో పాల్గొన్నవాళ్లకు ప్రమాదాలు తప్పట్లేదు. ఇది ప్రాణాలకు తెగించి ఆడే ఆట కావడంతో గాయాల పాలవడం, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది.

ఈసారి కూడా ఈ జల్లికట్టు పోటీల్లో దాదాపు 40 మందికిపైగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎద్దును లొంగదీసుకునే క్రమంలో వాటి కాళ్ళ కింద పడ్డటంతో గాయపడ్డారు. అయితే ఈ పోటీల్లో ప్రతి ఏడాది అనేక మందికి గాయాలవుతున్నాయి. అయినా జనాలు వెనక్కి తగ్గడం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా