- Telugu News Photo Gallery PM Modi to dedicate 3 frontline naval combatants INS Surat, INS Nilgiri and INS Vaghsheer to the nation
PM Modi: బుధవారం మూడు నావికా యుద్ధ నౌకలను జాతీయ అంకితం చేయనున్న ప్రధాని మోదీ.. ఫోటోలు చూశారా?
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితం చేయనున్నారు. రక్షణ తయారీ, సముద్ర భద్రతలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలనే భారతదేశ కలను సాకారం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు..
Updated on: Jan 14, 2025 | 7:32 PM

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా మూడు కొత్త యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేయనున్నారు. పీఎంవో వివరాల ప్రకారం.. మూడు ప్రధాన నౌకాదళ యుద్ధనౌకలు INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్‌షీర్‌లను దేశానికి అంకితం చేయడం, రక్షణ తయారీ, సముద్ర భద్రతలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలనే భారతదేశ కలను సాకారం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు.

నవీ ముంబైలో ఇస్కాన్ ప్రాజెక్టు కింద శ్రీశ్రీశ్రీ రాధా మదన్‌మోహన్‌జీ ఆలయాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. తొమ్మిది ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులో చాలా దేవతలతో కూడిన ఆలయం, వేద విద్యా కేంద్రం, ప్రతిపాదిత మ్యూజియం, ఆడిటోరియం, చికిత్స కేంద్రం వంటివి ఉన్నాయి.

INS నీలగిరి 17A స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ మొదటి నౌక. దీనిని ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. దీని సామర్ధ్యం సముద్రంలో ఎక్కువసేపు ఉండడం. అలాగే ఇందులో అధునాతన టెక్నాలజీతో రూపొందించారు. ఇది తరువాతి తరం స్వదేశీ యుద్ధనౌకలను సూచిస్తుంది.

INS సూరత్ 15B క్లాస్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్‌లో నాల్గవ, చివరి నౌక. ఇది ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత అధునాతన డిస్ట్రాయర్లలో ఒకటి. ఇది 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇందులో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ ప్యాకేజీలు, అధునాతన నెట్‌వర్క్-సెంట్రిక్ సామర్థ్యాలు ఉన్నాయి.

ఫ్రెంచ్ నేవీ సహకారంతో.. : INS వాఘ్షీర్ P75 స్కార్పెన్ ప్రాజెక్ట్ ఆరవ, చివరి జలాంతర్గామి. జలాంతర్గామి నిర్మాణంలో భారతదేశం పెరుగుతున్న నైపుణ్యానికి INS వాఘ్షీర్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది ఫ్రెంచ్ నావల్ గ్రూప్ సహకారంతో నిర్మించారు.





























