- Telugu News Photo Gallery Does skipping baths in winter increase life span by 34 percent ? know what the study claims
Winter Bath: చలిగా ఉందని స్నానం మానేస్తున్నారా? మీ ఆయుశ్షు మరింత పెరుగుతుందట..
చాలా మందికి చలికాలంలో స్నానం చేయాలంటే వల్లమాలిన బద్దకం. ఉదయాన్నే పొద్దెక్కే వరకు నిద్రపోతారు. ఇక రాత్రిళ్లు 7 గంటలకు ముందే మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తారు. మధ్యలో స్నానం చేయమంటే మాత్రం హడలెత్తిపోతారు. ఇలా చలికాలంలో స్నానం మానేస్తే మీ ఆయుష్షుకు మంచిదే అంటున్నారు సైంటిస్టులు..
Updated on: Jan 14, 2025 | 7:27 PM

మన రోజువారీ జీవితంలో స్నానం చాలా ముఖ్యమైన భాగం. చాలా మంది స్నాన చక్రంలో గంటల తరబడి గడుపుతారు. ఎండాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి ఉల్లాసంగా ఉంటుంది. అదే శీతాకాలంలో సీన్ రివర్స్ అవుతుంది. ఎముకలు గడ్డకట్టించే చల్లటి నీటితో స్నానం చేయడానికి చాలా మంది భయపడతారు. ఇలా చేస్తే ఆరోగ్యం పాడవుతుందని అందరూ భావిస్తారు. కానీ ఇది మీ ఆయుష్షు ఎంతో లాభం చేకూరుస్తుందట.

చలికాలంలో స్నానం చేయకపోతే ఆయుష్షు 34 శాతం పెరుగుతుందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. దీని వెనుక శాస్త్రీయ హేతువు కూడా ఉంది. అదేంటంటే.. ఉష్ణోగ్రత వృద్ధాప్యాన్ని ప్రభావితం చేస్తుంది - ఉష్ణోగ్రత మానవ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా వృద్ధాప్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. శీతల వాతావరణంలో ప్రజల జీవక్రియ మందగిస్తుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది DNA నష్టం, ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది మనిషి వృద్ధాప్య ప్రక్రియపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. పైగా శీతాకాలంలో స్నానం మానేస్తే మానవ జీవిత కాలం మరింత పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

2018 అధ్యయనం ప్రకారం చల్లని ఉష్ణోగ్రతలు ఎలుకల సగటు జీవితకాలాన్ని 20 శాతం పెంచాయి. అయినప్పటికీ, మానవులపై దాని ప్రభావాల గురించి ఇప్పటికీ బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ ఈ పరిశోధనలో ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తున్నట్లు గుర్తించారు.

మానవులు చల్లని వాతావరణంలో ఎక్కువ కాలం జీవించే ధోరణి కలిగి ఉంటారట. చలికాలంలో స్నానం చేయకపోవడం వల్ల ఆయుష్షు 34 శాతం పెరుగుతుందన్న వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేవు. చలికాలంలో స్నానం చేయకపోతే ఆయుష్షు పెరుగుతుందని ఇంకా రుజువు కాలేదు. అయినప్పటికీ, చల్లని వాతావరణంలో ప్రజల ఆయుర్దాయం ఖచ్చితంగా పెరుగుతుందనేది నిజమని పరిశోధకులు చెబుతున్నారు.

అయితే.. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే వేడి నీళ్లలో స్నానం చేయడం వల్ల శరీరానికి సౌఖ్యం లభిస్తుంది. కానీ ఈ నీరు శరీరంపై ఎక్కువ సేపు పడితే చర్మం పొడిబారుతుంది. మళ్లీ చలికాలంలో చలికి ఎక్కువ సేపు స్నానం చేయకపోతే బాక్టీరియా శరీరంలో పేరుకుపోతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మంచి ఆరోగ్యానికి పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. ఆయుష్షు పెరుగుతుందని ఎక్కువ రోజులు స్నానం చేయకుంటే అసలుకే ఎసరు వస్తుంది జాగ్రత్త.





























