AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIV అని చెబితే శిక్ష తగ్గుద్దనుకున్నావా.. కూతురిపై ఆత్యాచారానికి పాల్పడిన తండ్రికి కోర్టు దిమ్మతిరిగే షాక్!

కోల్‌కతాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. పెంచుకున్న 14 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడిన 31 ఏళ్ల తండ్రికి కోర్ట్ జైలు శిక్ష విదించగా.. నిందితుడు తాను హెచ్‌ఐవీ పాజిటివ్‌తో బాధపడుతున్నానని తనకు శిక్ష తగ్గించాలని కోరాడు. దీంతో అతనిపై ఆగ్రహానికి గురైన కోర్టు శిక్ష తగ్గించడానికి బదులుగా జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.

HIV అని చెబితే శిక్ష తగ్గుద్దనుకున్నావా.. కూతురిపై ఆత్యాచారానికి పాల్పడిన తండ్రికి కోర్టు దిమ్మతిరిగే షాక్!
Kolkata
Vijay Saatha
| Edited By: Anand T|

Updated on: Jun 25, 2025 | 9:44 PM

Share

కోల్‌కతాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. పెంచుకున్న తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రి కోర్టు జీవితఖైదు విధించింది. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే తనకు శిక్షపడే చివరి నిమిషంలో నిందితుడు తనకు హెచ్‌ఐవీ ఉన్నట్టు అంగీకరించడం అతన్ని మరింత చిక్కుల్లో పడేలా చేసింది. వివరాళ్లోకి వెళితే.. కోల్‌కాకు చెందిన 31 ఏళ్ల అజిత్ పాంజా అనే వ్యక్తి తను పెంచుకుంటున్న 14 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నిందితున్ని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చారు.

అయితే ఇప్పటికే మూడేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసు విచారణ సందర్భంగా నిందితుడు పాంజాను దోషిగా తేలుస్తూ కోల్‌కతా పోక్సో కోర్టు అతనికి శిక్ష ఖరారు చేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది.. తనకున్న రోగం గురించి చెప్తే తనకు శిక్ష తగ్గుతుందని గ్రహించిన నిందితుడు.. శనివారం తన శిక్ష నిర్ణయించే ముందు చివరిసారి కోర్టులో ఓ కోరిక కోరాడు. తాను హెఐవీతో బాధపడుతున్నానని.. దయచేసి శిక్ష విషయంలో న్యాయమూర్తులు మానవత్వంతో వ్యవహరించాలని కోరాడు. అది విన్న న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. చేసిందే తప్పు..పైగా శిక్ష తగ్గించమంటావా అనే రీతిలో తీర్పు వెలువరించారు.

నిందితుడి విన్నపంపై న్యాయమూర్తి స్పందిస్తూ.. హెచ్‌ఐవీ ఉందని ఒప్పుకోవడం వల్ల కేసు శిక్షను ఏమి తగ్గించమని.. ఇది కేసు తీవ్రతను మరింత పెంచిందని పేర్కొన్నారు. కోర్టు అభిప్రాయం ప్రకారం, హెచ్ఐవీ ఉండి కూడా లైంగిక దాడికి పాల్పడటం అత్యంత తీవ్రమైన నేరంగా న్యాయమూర్తి పరిగణించారు. ఇది బాధితురాలి ఆరోగ్యాన్ని, భవిష్యత్తును ప్రమాదంలో నెట్టడం అనే అభిప్రాయంతో జీవిత ఖైదు విధించారు.

నిందితుడిపై ఇంతకుముందు క్రిమినల్ రికార్డు ఏమి లేదని, అతని వయస్సును దృష్టిలో ఉంచుకొని అయినా శిక్షను తగ్గించాలని నిందితుడి తరపు అడ్వకేట్ వాదించినా న్యాయమూర్తి మాత్రం దానికి అంగీకరించలేదు. ఆడపిల్లల భద్రతకు తండ్రిగా ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి దారుణానికి ఒడిగట్టినందుకు మినహాయింపు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో తనకున్న రోగం గురించి నిజం చెపితే శిక్ష పడుతుందనుకున్న నిందితుడికి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..