Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahishmati: మాహిష్మతిని బాహుబలిలో చూశారు..? కానీ అసలైన ‘మాహిష్మతి సామ్రాజ్యం’ భారత్‌లో ఎక్కడుందో తెలుసా..?

Mahishmati: మాహిష్మతి సామ్రాజ్యం పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది 'బాహుబలి' సినిమా. మాహిష్మతి పేరు ఇప్పటి వరకు ఎప్పుడూ వినక పోవడంతో ఇది సినిమా కోసమే..

Mahishmati: మాహిష్మతిని బాహుబలిలో చూశారు..? కానీ అసలైన ‘మాహిష్మతి సామ్రాజ్యం’ భారత్‌లో ఎక్కడుందో తెలుసా..?
Mahishmati
Follow us
Subhash Goud

|

Updated on: May 27, 2021 | 1:43 PM

Mahishmati: మాహిష్మతి సామ్రాజ్యం పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘బాహుబలి’ సినిమా. మాహిష్మతి పేరు ఇప్పటి వరకు ఎప్పుడూ వినక పోవడంతో ఇది సినిమా కోసమే క్రియేట్‌ చేసిందని అంతా భావిస్తున్నారు. కానీ భారతదేశంలో ఒకప్పుడు మాహిష్మతి పేరుతో ఒక సామ్రాజ్యం ఉండేది అనే విషయం చాలా మందికి తెలియదు. ఒకప్పుడు మాహిష్మతి సామ్రాజ్యంగా పిలవబడే ఆ రాజ్యం ఇపుడు ‘మహేశ్వర్‌’గా పిలవబడుతోంది.

ఈ మాహిష్మతి సామ్రాజ్యాం ఎక్కడ ఉంది..?

అయితే ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని అందరు బాహుబలిలో మాత్రమే చూశారు. నిజంగా ఇది ఎక్కడ ఉందో అనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. మాహిష్మతి అనగానే బాహుబలి సినిమా తప్ప వేరేదేది గుర్తుకు రాదు. ఈ మాహిష్మతి సామ్రాజ్యం మధ్యప్రదేశ్‌లో ఉంది. ఆ రాష్ట్రంలో మహేశ్వర్‌ అనే పట్టణాన్ని పూర్వం మాహిష్మతి అని పిలిచేవారు. రామాయణ, మహాభారతాల్లో ఈ మాహిష్మతి రాజ్య ప్రస్తావన ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కార్గోన్ జిల్లాలో ఉంది. ఇండోర్ నుండి 91 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది.

11 అఖండ దీపాలు

నర్మదా నది తీరంలో నర్మదా నది సమీపంలో ఉన్న సహస్రార్చన మందిరాన్ని దర్శిస్తే ఆ కాలం నాటి గోపురాలు, మందిరాలు, ఆ కాలం నాటి గొప్ప తనాన్ని తెలియజేస్తాయి. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఈ ప్రాచీన పట్టాణాన్ని కార్తీయ వీయాజ్జునుడు తన రాజ్యానికి రాజధానిగా చేసుకుని పరిపాలన చేసే వాడు. ఇప్పటికీ మహేశ్వర్ లోని సహస్రార్చన దేవాలంలో 11 అఖండ దీపాలు నాటి నుండి నేటికీ వెలుగుతూనే ఉండటం విశేషం.

రాజమాత 18వ శతాబ్దంలో రాజమాత అహల్య భాయ్‌ హోల్కర్‌ తన భర్త మరణాంతరం మాహిష్మతి సామ్రాజ్యాన్ని నడి ఒడ్డుగా చేసుకుని మాల్వ దేశాన్ని పరిపాలించిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. శివ భక్తురాలైన అహల్య దేవి ఎన్నో శివాయలాలను పునరుద్దరించింది. వాటిలో గుజరాత్‌లోని ఉజ్జయిని, గయ తదితర ఆలయాలున్నాయి. ధర్మరాజు మాహిష్మతి రాజ్యాన్ని సహర్చాన తర్వాత నిశాధ రాజ్యపు రాజు చేజిక్కించుకుని పరిపాలించాడని తెలుస్తోంది. కురుక్షేత్ర యుద్ధం అనంతరం ధర్మరాజు రాజ్యానికి రాజు అయిన తర్వాత మాహిష్మతి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని యుద్ధం ప్రారంభించాడని, కానీ దాన్ని హస్తగతం చేసుకోలేక పోయాడు అని చెబుతుంటారు. అలాగే కోట రాజమాత అహల్య ఈ కోట నుండే అప్పట్లో పాలన సాగించారు. ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా ఉండటం ఈ ఫోటోలో చూడొచ్చు. అయితే బాహుబలి సినిమాలో సెట్టింగుల తరహాలో.. మహేశ్వర్ లోని కట్టడాలను చూస్తుంటే బాహుబలి సినిమాలోని మాహిష్మతి రాజ్యాన్ని చూసిన అనుభూతే కలుగుతుంది.

ఇవీ కూడా చదవండి:

EARTH or MARS : అది భూ గ్రహమా.. లేదా అంగారక గ్రహమా..? కన్‌ఫ్యూజ్ అయిన యూరోపియన్ వ్యోమాగామి..

గ్రహణానికి ముందు మెరిసిపోయిన చంద్రుడు.. ఎలా ఉన్నాడో మీరే చూడండి…