Credit Cards: ఇక ఆ బ్యాంకు నుంచి సులభంగా క్రెడిట్‌ కార్డు పొందవచ్చు.. తక్కువ వివరాలతో కార్డు జారీ

Credit Cards: మీరు క్రెడిట్‌ కార్డు పొందాలనుకుంటున్నారా..? ఇకపై సులభంగా క్రెడిట్‌ కార్డు పొందవచ్చు. ప్రైవేటు రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ కొత్త సర్వీసులు అందుబాటులోకి..

Credit Cards: ఇక ఆ బ్యాంకు నుంచి సులభంగా క్రెడిట్‌ కార్డు పొందవచ్చు.. తక్కువ వివరాలతో కార్డు జారీ
Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: May 27, 2021 | 1:06 PM

Credit Cards: మీరు క్రెడిట్‌ కార్డు పొందాలనుకుంటున్నారా..? ఇకపై సులభంగా క్రెడిట్‌ కార్డు పొందవచ్చు. ప్రైవేటు రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో కస్టమర్లు బ్యాంక్ నుంచి సులభంగానే క్రెడిట్ కార్డులు పొందే అవకాశం ఉంటుంది. అయితే తమ బ్యాంకు కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించడానికి ట్రాన్స్‌యూనియన్‌ సొల్యూషన్‌ను అమలు చేసింది. దీంతో వినియోగదారులు బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు పొందడానికి తక్కువ వివరాలు అందించినా సరిపోతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అలాగే ఫిజికల్ డాక్యుమెంట్లతో పని లేకుండా క్రెడిట్ కార్డు జారీ చేస్తోంది.

క్రెడిట్‌ కార్డు జారీ చేసే ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్లకుండా ఎలాంటి ఫిజికల్‌ డాక్యుమెంట్లు సమర్పించకుండానే మీరు బ్యాంకు నుంచి క్రెడిట్‌ కార్డు పొందే అవకాశం కల్పిస్తోంది యస్‌ బ్యాక్‌. అలాగే వేగంగా క్రెడిట్‌ కార్డు మీ ఇంటికి చేరుతుంది.

కాగా, ఇటీవల క్రెడిట్‌ కార్డుల జారీలో ఆంక్షలు విధించింది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ), దీంతో క్రెడిట్‌ కార్డుల జారీ విషయంలో బ్యాంకులు కూడా ఆంక్షలు విధిస్తూ కార్డులను జారీ చేయడం లేదు. కరోనా మహమ్మారి కాలంలో క్రెడిట్‌ కార్డుల జారీ నిలిపివేయాలని ఆర్బీఐ సూచించడంతో పెద్దగా జారీ చేయలేదు బ్యాంకులు. ఇక తాజాగా యస్‌ బ్యాంకు వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడంలో భాగంగా సులభమైన పద్దతిలో కస్టమర్లకు క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తోంది.

ఇవీ కూడా చదవండి:

SBI Scheme: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో ఈ స్కీమ్‌లో చేరడానికి గడువు జూన్ 30వ తేదీ

Royal Enfield Plants: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తయారీ కంపెనీ కీలక నిర్ణయం.. 27 నుంచి ప్లాంట్లు మూసివేత