AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Scheme: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో ఈ స్కీమ్‌లో చేరడానికి గడువు జూన్ 30వ తేదీ

SBI Scheme: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కస్టమర్లకు గుడ్‌న్యూస్‌. వృద్ధులకు స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ (ఎస్‌బీఐ వీకేర్‌) గడువు జూన్‌ 30వరకు పొడిగిస్తున్నట్లు ఎ..

SBI Scheme: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో ఈ స్కీమ్‌లో చేరడానికి గడువు జూన్ 30వ తేదీ
State Bank of India
Follow us
Subhash Goud

|

Updated on: May 27, 2021 | 10:30 AM

SBI Scheme: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కస్టమర్లకు గుడ్‌న్యూస్‌. వృద్ధులకు స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ (ఎస్‌బీఐ వీకేర్‌) గడువు జూన్‌ 30వరకు పొడిగిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. కోవిడ్‌ దృష్టిలో ఉంచుకుని వృద్ధుల కోసం ప్రత్యేకంగా టర్మ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను 2020మే లో ప్రకటించింది ఎస్‌బీఐ. తర్వాత డిసెంబర్ వరకు ఓసారి, 2021 మార్చి 31 వరకు మరోసారి గడువును పొడిగించింది. ఈ గడువు ముగుస్తుండటంతో మరోసారి మూడు నెలలు గడువు పొడిగించింది. కాబట్టి సీనియర్ సిటిజన్లు ‘ఎస్‌బీఐ వీకేర్’ స్కీమ్‌లో డిపాజిట్ చేయడానికి జూన్‌ 30 వరకు గడువు ఉంది. సాధారణంగా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు వృద్ధులకు వేరుగా ఉంటాయి. సాధారణ వడ్డీ రేట్ల కన్నా వృద్ధులకు 50 బేసిస్ పాయింట్స్ అంటే అర శాతం వడ్డీ ఎక్కువ లభిస్తుంది.

అయితే ప్రస్తుతం మామూలు జనాలకు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 5.40 శాతం వడ్డీని అందిస్తోంది. వృద్ధులకు 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువ వడ్డీ చెల్లిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం వడ్డీ వస్తుంది. ఒకవేళ ‘ఎస్‌బీఐ వీకేర్’ స్కీమ్‌లో డిపాజిట్ చేస్తే అదనంగా 30 బేసిస్ పాయింట్స్ వడ్డీ లభిస్తుంది. అంటే ఈ స్కీమ్‌లో డిపాజిట్ ద్వారా సీనియర్ సిటిజన్లు 6.20 శాతం వడ్డీ పొందవచ్చు.

ఈ స్కీమ్‌లో డిపాజిట్‌ చేయాలంటే..

కాగా, ఈ స్కీమ్‌లో డిపాజిట్‌ చేయాలనుకుంటే వయస్సు 60 ఏళ్ల పైనే ఉండాల్సి ఉంటుంది. భార్యాభర్తలు సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ తీయవచ్చు. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.15,00,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. మొదట ఐదేళ్లకు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు.

ఐదేళ్ల కన్న ముందే డబ్బులు విత్‌డ్రా చేస్తే..

అయితే ఐదేళ్ల కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేస్తే వడ్డీ నష్టపోవాల్సి ఉంటుంది. 0.30 శాతం వడ్డీ తక్కువగా వస్తుంది. అప్పుడు సాధారణంగా సీనియర్ సిటిజన్లకు వర్తించే వడ్డీ రేట్లే వర్తిస్తాయి. ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీపై ఎలాంటి ఆదాయపు పన్ను మినహాయింపులు ఉండవు. అందుకే ఇలాంటివి ముందస్తుగానే తెలుసుకోవాలి.

ఇవీ కూడా చదవండి:

June Month Rules: జూన్‌ 1 నుంచి అందుబాటులోకి రానున్న కొత్త నిబంధనలు.. కస్టమర్ల తప్పకుండా గనించాలి

SBI RULES RELAXATION : బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..! నగదు విత్ డ్రా పరిమితి పెంపు.. ఒక్క రోజులో ఎంత మొత్తం తీసుకోవచ్చంటే..?