Royal Enfield Plants: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తయారీ కంపెనీ కీలక నిర్ణయం.. 27 నుంచి ప్లాంట్లు మూసివేత

Royal Enfield Plants: అతిపెద్ద మోటారు బైక్‌ సంస్థ అయిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మూడు తయారీ ప్లాంట్లను మూసివేస్తోంది.మే 27 నుంచి మే 29 వరకు తయారీ ప్లాంట్లను మూసివేయనున్నట్టు..

Royal Enfield Plants: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తయారీ కంపెనీ కీలక నిర్ణయం.. 27 నుంచి ప్లాంట్లు మూసివేత
Royal Enfield
Follow us
Subhash Goud

|

Updated on: May 27, 2021 | 7:41 AM

Royal Enfield Plants: అతిపెద్ద మోటారు బైక్‌ సంస్థ అయిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మూడు తయారీ ప్లాంట్లను మూసివేస్తోంది.మే 27 నుంచి మే 29 వరకు తయారీ ప్లాంట్లను మూసివేయనున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. అయితే దీనిపై రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మూడు తయారీ ప్లాంట్లు దక్షిణ తమిళనాడులోని చెన్నైప్రాంతాల్లో ఉన్నాయి.

మే 13, మే 16 మధ్య రాయల్ ఎన్ ఫీల్డ్ చెన్నైలోని తయారీ కేంద్రాల వద్ద ఉత్పత్తి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. తిరువొట్టియూర్, ఒరాగడమ్, వల్లం వడగల్ సౌకర్యాలలో కంపెనీ తయారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇక తమిళనాడులో కరోనా కేసుల నేపథ్యంలో రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కూడా తమిళనాడులోని తమ ప్లాంట్లను ఐదు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదిలావుండగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) చెన్నై ప్లాంట్‌లో మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసింది. హ్యుందాయ్ యాజమాన్యం మే 25 నుండి మే 29 వరకు 5 రోజుల పాటు ప్లాంట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు హెచ్ఎంఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా, తమిళనాడులో మంగళవారం 34,285 కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య19,11,496 కు చేరింది. గత 24 గంటల్లో 468 కరోనా మరణాలు నమోదు కాగా ఇప్పటివరకు 21,340 మంది మరణించారు. COVID-19 వ్యాప్తిని నివారించడానికి మే 24 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. మరో వారం పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇవీ కూడా చదవండి:

Realme X7 Max: రియల్‌మీ నుంచి రానున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. అద్భుతమైన ఫీచర్స్‌.. పూర్తి వివరాలు ఇవే..

RBI Guidelines: ఆ బ్యాంకుల విలీనానికి లైన్‌ క్లియర్‌.. మార్గ దర్శకాలను జారీ చేసిన ఆర్బీఐ..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?