AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme X7 Max: రియల్‌మీ నుంచి రానున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. అద్భుతమైన ఫీచర్స్‌.. పూర్తి వివరాలు ఇవే..

Realme X7 Max: రియల్‌ మీ సంస్థ మార్కెట్లోకి మరో ఫోన్‌ను విడుదల చేయబోతోంది. రియల్‌మీ ఎక్స్‌7 మ్యాక్స్‌ పేరుతో రానున్న ఈ మొబైల్‌కు సంబంధించి టీజర్‌ను ఇటీవల విడుదల..

Realme X7 Max: రియల్‌మీ నుంచి రానున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. అద్భుతమైన ఫీచర్స్‌.. పూర్తి వివరాలు ఇవే..
Realme X7 Max
Subhash Goud
|

Updated on: May 25, 2021 | 2:53 PM

Share

Realme X7 Max: రియల్‌ మీ సంస్థ మార్కెట్లోకి మరో ఫోన్‌ను విడుదల చేయబోతోంది. రియల్‌మీ ఎక్స్‌7 మ్యాక్స్‌ పేరుతో రానున్న ఈ మొబైల్‌కు సంబంధించి టీజర్‌ను ఇటీవల విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఏకంగా మొబైల్‌ ఫీచర్లన్నీ లీక్‌ అయిపోయాయి. వాటి ప్రకారం చూస్తే.. రియల్‌మీ ఎక్స్‌ సిరీస్‌లో కొత్త వెర్షన్‌గా ఎక్స్‌ 7 మ్యాక్స్‌ రాబోతోంది. ఇందులో మీడియాటెక్‌ డైమన్‌సిటీ 1200 చిప్‌ సెట్‌ ఇస్తున్నారు. ఈ చిప్‌సెట్‌తో  ఇండియాలో రాబోతున్న తొలి మొబైల్‌ ఇదే కావడం గమనార్హం. ఇది 5జీకి సపోర్టు చేస్తుంది. వెనుకవైపు మూడు కెమెరాలు ఉంటాయి. అందులో 64 ఎంపీ మెయిన్‌ కెమెరా కాగా, 8ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఇస్తున్నారు. ఇందులో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 50 వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కి సపోర్టు చేస్తుంది.

రియల్‌మీ ఎక్స్‌ 7 మ్యాక్స్‌ మొబైల్‌ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. ఒక వేరియంట్‌ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ కాగా, మరొకటి 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ అంతర్గత స్టోరేజీతో రాబోతోంది. ఇక ధర విషయానికొస్తే 8జీబీ/128జీబీ వేరియంట్‌ ధర ₹28వేలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 12జీబీ/256 జీబీ వేరియంట్‌ ₹31వేలు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే మొబైల్‌ విడుదలయ్యే తేదీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు రియల్‌మీ. టీజర్‌ విడుదల చేశారు కాబట్టి.. ఈ నెలాఖరున ఆన్‌లైన్‌ ఈవెంట్‌లో మొబైల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి:

RBI Guidelines: ఆ బ్యాంకుల విలీనానికి లైన్‌ క్లియర్‌.. మార్గ దర్శకాలను జారీ చేసిన ఆర్బీఐ..!

Google Photos: గూగుల్ ఫోటోస్ వాడుతున్నారా? జూన్‌ 1 నుంచి ఉచిత స్టోరేజీ ఉండదు.. మరి ఎక్కువ స్టోరేజీ కావాలంటే..

Follow Us
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా