Dog Fly: క్రూరత్వానికి పరాకాష్ట.. బెలూన్లతో కుక్కను గాలిలో ఎగరేసిన యూట్యూబర్.. ఆ తర్వాత ఏమైందంటే..?

Delhi youtuber arrested: అనతికాలంలోనే ట్రెండ్ కావాలన్న సాకుతో పలువురు చేస్తున్న పనులు క్రూరత్వానికి పరాకాష్టగా మారుతోంది. మానవత్వం మరిచిపోయి

Dog Fly: క్రూరత్వానికి పరాకాష్ట.. బెలూన్లతో కుక్కను గాలిలో ఎగరేసిన యూట్యూబర్.. ఆ తర్వాత ఏమైందంటే..?
Delhi Youtuber Arrest
Follow us

|

Updated on: May 27, 2021 | 1:42 PM

Delhi youtuber arrested: అనతికాలంలోనే ట్రెండ్ కావాలన్న సాకుతో పలువురు చేస్తున్న పనులు క్రూరత్వానికి పరాకాష్టగా మారుతోంది. మానవత్వం మరిచిపోయి వారు ప్రవర్తిస్తున్న తీరు అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. తాజాగా ఢిల్లీకి చెందిన యూట్యూబర్ ఇటీవల తన పెంపుడు కుక్కను.. హైడ్రోజన్ బెలూన్లకు కట్టి వీడియోను తయారు చేశాడు. వాటితో కలిపి కుక్కను ఎగరవేసాడు. అది కాస్తా వైరల్‌గా మారడంతో చూసినవాళ్లంతా యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాలు.. ఢిల్లీకి గౌరవ్ జాన్ తన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక వీడియో తయారు చేశాడు. అందులో అతను తన పెంపుడు కుక్కతో ఢిల్లీలోని ఒక పార్కులో కనిపిస్తాడు. గౌరవ్ కుక్కకు అనేక హైడ్రోజన్ బెలూన్లను కట్టి ఎగిరేలా చేశాడు. కుక్క గాలిలో కొద్దిసేపు అలానే ఉంటుంది.

అనంతరం ఈ వీడియోను గౌరవ్ యూట్యూబ్‌లో షేర్ చేసిన తరువాత జంతు హక్కుల సంస్థల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పీపుల్ ఫర్ యానిమల్ (పిఎఫ్‌ఎ) సభ్యులు ఈ వీడియోపై ఢిల్లీలోని మాల్వియా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జంతు హింస కేసు కింద గౌరవ్ జాన్, అతని తల్లిపై 188, 269, 34 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. అనంతరం యూట్యూబర్ గౌరవ్‌జాన్ ను అరెస్టు చేశారు.

ఫిర్యాదుల అనంతరం గౌరవ్ జాన్ వీడియోను తొలగించిన తరువాత.. గౌరవ్ జాన్ మరో వీడియో దీనిపై స్పష్టతనిచ్చాడు. ఈ వీడియో తీసే ముందు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని వెల్లడించాడు. తన పెంపుడు కుక్క డాలర్‌ వీడియో చూసి బాధపడిన వారందరూ క్షమించాలని కోరాడు.

Also Read:

justice for lovi assumi: మృగాళ్ల పైశాచికత్వం.. అమ్మాయి దుస్తులు చింపేసి, ఘోరం.. వీడియో వైరల్..

Sekar Babu: ఉత్తరాది భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి.. ఏమన్నారంటే?